ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా వున్న అమరావతిని పూర్తీ స్థాయిలో అభివృద్ధి చేయాలంటే లక్ష 10 వేల కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని వైసీపీ నేతలు తెలిపిన సంగతి తెలిసిందే. అయితే విశాఖపట్టణాన్ని అభివ్రుది చేయడానికి కేవలం 10 వేల కోట్ల రూపాయలు చాలు అని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే అమరావతి రాజధాని కోసం భూముల ఇచ్చిన రైతులకు వారి భూమిని తిరిగిచ్చేస్తామని మంత్రి పెద్ది రెడ్డి అన్నారు. ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా రైతులకు భూమిని ఇస్తామని ప్రకటించారు.
అయితే ఇప్పటికే అమరావతి రైతులు ధర్నాలు, నిరసనలతో ఆందోళనలు వ్యక్తం చేస్తున్న సమయం లో వీరి వ్యాఖ్యలకు రైతులు ఎలా స్పందిస్తారన్నది తెలియాల్సి వుంది. బోస్టన్ కన్సల్టెన్సీ నివేదిక జనవరి 3 న అందుతుందని తెలిపారు. బోస్టన్ కమిటీ ఇచ్చిన నివేదిక ని ఆధారం చేసుకొని రాజధాని విషయం లో ఒక నిర్ణయం తీసుకుంటామని అన్నారు.