బ్యాక్ టు బ్యాక్ మూవీ లు రిలీజైనప్పుడు అన్నీ థియేటర్లకు వెళ్లి చూడడమనేది అందరికీ సాధ్యం కాదు. ముఖ్యంగా మధ్య తరగతి వారికి. ఎందుకంటే మల్టీప్లెక్స్‌లో మూవీ టికెట్ల ధరలు ఇప్పుడు బాగా పెరిగాయి. దీంతో చాలామంది ఓటీటీల్లోనే సినిమాలు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా లవర్స్‌కు మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఒక బంపపరాఫర్ ఇచ్చింది. నేషనల్ సినిమా డేను పురస్కరించుకుని రూ.99లకే మల్టీప్లెక్స్‌లో సినిమా చూసే అవకాశాన్ని కల్పించనుంది.
2023లో పలు సూపర్ హిట్ సినిమాలు విడుదలయ్యాయి. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాయి. రికార్డు స్థాయి కలెక్షన్లు సొంతం చేసుకున్నాయి. చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ వంటి టాలీవుడ్ స్టార్ హీరోల మూవీ లు రిలీజయ్యాయి. అలాగే విజయ్, రజనీకాంత్, షారుఖ్ ఖాన్, సన్నీడియోల్, అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్, టోవినో థామస్ తదితర ఇతర భాషల హీరోల సినిమాలు కూడా థియేటర్లలో సందడి చేశాయి. వందల కోట్ల రూపాయలకూ పైగా బిజినెస్ చేశాయి
వివరాల్లోకి వెళితే.. కొవిడ్ సమయలో చిత్ర పరిశ్రమ చాలా రోజుల పాటు స్తబ్దుగా ఉండిపోయింది. థియేటర్లకు రావడానికి ప్రేక్షకులు ఆలోచించేవారు .. ఈ నేపథ్యంలోనే భారీ సంఖ్యలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు పలు ప్రణాళిక ను రూపొందించారు. అందులో ‘నేషనల్ సినిమా డే’ వేడుక కూడా ఒకటి. ఈరోజున దేశవ్యాప్తంగా పలు మల్టీప్లెక్స్‌లతో పాటు ఎంపిక చేసిన థియేటర్లలో అన్ని మూవీ ల టిక్కెట్లను తక్కువ ధరకు విక్రయించడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ ప్రయత్నానికి మంచి స్పందన కూడా వచ్చింది. అందుకే ఈ ఏడాది కూడా ‘నేషనల్ సినిమా డే’ జరుపుకోవాలని మల్టీప్లెక్స్‌లు, థియేటర్ల యాజమాన్యాలు నిర్ణయించుకున్నాయి.