సుకుమార్ క్రియేటివిటీకి తగ్గట్టుగా రెడీ అవుతున్న బన్నీ

సుకుమార్ క్రియేటివిటీకి తగ్గట్టుగా రెడీ అవుతున్న బన్నీ

ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అల.. వైకుంఠపురములో’ సినిమాలో నటిస్తున్న అల్లు అర్జున్ ఈ సినిమా పూర్తయిన వెంటనే సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమాలో నటించనున్నారు. అల్లు అర్జున్ కెరీర్‌లో 20వ సినిమాగా ఈ సినిమా రూపొందనుంది. అయితే సుకుమార్ రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారం ఈ సినిమాలో బన్నీ చాలా డిఫరెంట్‌గా మేకోవర్ కానున్నాడట. రంగస్థలం సినిమాలో రామ్ చరణ్‌ని ఎలాగైతే ప్రత్యేకంగా చూపించారో ఈ సినిమాలో అల్లు అర్జున్‌ని అంతకంటే ప్రత్యేకంగా చూపించాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నారట.

ఈ సినిమా కూడా రంగస్థలం తరహాలోనే రివేంజ్ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక్ డ్రామాగా ఉంటుందట. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో ఎర్రచందనం దుంగలను లారీలో స్మగ్లింగ్ చేసే వ్యక్తి పాత్రలో బన్నీ కనిపించబోతున్నాడట. అందుకే ఈ లుక్ కోసం బన్నీ చాలా రఫ్‌గా మారబోతున్నాడట.

ఈ సినిమాలో చిత్తూరు యాసలో బన్నీ చెప్పే డైలాగ్స్ థియేటర్లను దద్దరిల్లేలా చేస్తాయట. చిత్తూరు యాస నేర్చుకోవడానికి అల్లు అర్జున్ స్పెషల్ ట్రైనర్‌ని నియమించుకున్నాడని తెలుస్తోంది. సుకుమార్ క్రియేటివిటీకి తగ్గట్టుగా బన్నీ రెడీ అవుతున్నారని సమాచారం. ఈ చిత్రంలో బన్నీ సరసన క్రేజీ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించనుంది. విలన్ గా విజయ్ సేతుపతితో కనిపించబోతున్నారని సమాచారం. అతి త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్‌డేట్స్ ఇవ్వనున్నారు మేకర్స్.