రియల్‌మి నూతన స్మార్ట్‌ఫోన్

రియల్‌మి నూతన స్మార్ట్‌ఫోన్

నవంబర్ 20వ తేదీన రియల్‌మి తన కొత్త స్మార్ట్‌ ఫోన్ “రియల్‌మి ఎక్స్2 ప్రొ”ను భారత్‌లో విడుదల చేయనుంది. ఇవాళ్టి నుంచి రియల్‌మి వెబ్‌సైట్‌లో బ్లైండ్ ఆర్డర్ బుకింగ్ ప్రారంభం అయింది. ఈ ఫోన్‌ను అందరి కన్నా ముందుగానే కొనుగోలు చేసే అవకాశాన్ని వెబ్‌సైట్‌లో బ్లైండ్ రియల్‌మి తన కస్టమర్లకు అందిచనున్నది.

వినియోగదారులు ఒక వేయి చెల్లించి రియల్‌మి ఎక్స్2 ప్రొ ఫోన్‌ను బ్లైండ్ ఆర్డర్ చేస్కోవచ్చు. నవంబర్ 20న ఫోన్ లాంచ్ మరుసటి రోజు నవంబర్ 21న మిగిలిన మొత్తాన్ని చెల్లించాలి. ఇలా వినియోగదారులు కొనుగోలు చేసి అందరికన్నా ముందుగానే వినియోగదారులు డెలివరీ తీసుకోవచ్చు.