విద్యార్థులకు అల్పాహారం

విద్యార్థులకు అల్పాహారం

కార్మిక శాఖ మంత్రి సీహెచ్ మల్లా రెడ్డి రంగారెడ్డి జిల్లా గుండ్ల పోచం పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అల్పాహారం పంపిణీ చేసే కార్యక్రమం ప్రారంభించారు. అల్పాహారం పంపిణీ గ్లాండ్ ఫార్మా లిమిటెడ్, అక్షయ పాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యం లో జరుతుంది.

కార్మిక శాఖ మంత్రి సీహెచ్ మల్లా రెడ్డి మాట్లాడుతూ అక్షయ పాత్ర పేదలు, విద్యార్థుల ఆకలి తీరుస్తోందని అన్నారు. గ్లాండ్ ఫార్మా యాజమాన్యానికి, అక్షయ పాత్ర సభ్యులకు ఇటువంటి మంచి కార్యక్రమానికి సహకరిస్తున్న ధన్యవాదాలు తెలిపారు.