ఈ ఫీచర్‌ను ఉపయోగించాలంటే మీ వాట్సప్‌లో ఇలా చేయండి

ఈ ఫీచర్‌ను ఉపయోగించాలంటే మీ వాట్సప్‌లో ఇలా చేయండి

వాట్సప్‌ ఓ అద్భుతమైన ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇకపై ఎవరూ అనుమతి లేకుండా మన ఫోన్ నెంబర్ ను గ్రూప్‌లో చేర్చడం సాద్యం అవ్వదు. వాట్సప్‌ అప్‌డేట్‌ చేసి ఆండ్రాయిడ్‌ యూజర్‌ అయితే 2.19.308 వెర్షన్‌ వాడుతు ఉండాలి. ఐఫోన్‌ వినియోగిస్తుంటే 2.19.112 వెర్షన్‌లో ఉండాలి. లేని వారు వెంటనే యాప్‌ను అప్‌డేట్‌ చేస్కోవచ్చు. స్నేహితులు ఇంకా బంధువులతో ఎప్పటి అప్పుడు సంబంధాలు కలిగి ఉండేందుకు ఉపయోగపడే వాట్సప్‌ ఉపయోగకరం ఉన్న ఇబ్బందులు  కూడా ఉన్నాయి. మనకు తెలిసిన వ్యక్తో ఏదో ఒక గ్రూప్‌లో మనల్ని యాడ్‌ చేసేస్తుంటారు.

వాట్సప్‌లో మూడు చుక్కలున్న మెనూలోకి వెళ్లి సెట్టింగ్స్‌ను ఎంపిక చసకోవచ్చు. దానిలో అకౌంట్‌ నుండి ప్రైవసీలోకి వెళ్ళి గ్రూప్స్‌ అనే ఆప్షన్‌ ఎంచుకోవాలి. ఎవ్రీవన్‌, మై కాంటాక్ట్స్‌, మై కాంటాక్ట్స్‌ ఎక్సప్ట్‌ అనే మూడు ఆప్షన్లు ఉంటాయి. ఎవ్రీవన్‌ అనే ఆప్షన్ ని ఎవరూ యాడ్‌ చేయకూడదనుకుంటే ఎంచుకోవచ్చు. మీ ఫోన్‌ బుక్‌లో ఉన్నవారికి మాత్రమే యాడ్‌ చేసే అవకాశం ఇస్తే మై కాంటాక్ట్స్‌ అనే ఆప్షన్ ఎంచుకోవచ్చు. కొందరు మాత్రమే మిమ్మల్ని యాడ్‌ చేసే ఇక మూడో ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. ఈ ఆప్షన్‌ ఎనేబుల్‌ చేసుకుంటే గ్రూప్‌లో యాడ్‌ చేసినప్పుడు ఇన్‌వైట్‌ ఆప్షన్‌ వచ్చి మూడు రోజుల్లో సమ్మతి లేదా తిరస్కరణ తెలియజేయకుంటే దాని కాలపరిమితి ముగుస్తుంది.