శంషాబాద్ విమానాశ్రయానికి మరో 5 మార్గాల్లో బస్సులు

Buses on 5 other routes to Shamshabad Airport
Buses on 5 other routes to Shamshabad Airport

హైదరాబాద్ విమానాశ్రయానికి నగరం నలువైపుల నుంచి ఇప్పటికే 40కి పైగా ఏసీ ఎలక్ట్రిక్‌ బస్సులు నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరికొన్ని మార్గాల నుంచి ఎయిర్​పోర్టుకు మరిన్ని బస్సులు నడపాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది. ఇందులో భాగంగానే మరో 5 కేంద్రాల(రూట్ల) నుంచి నాన్‌ ఏసీ బస్సులు నడపనున్నట్లు టీఎస్‌ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ ప్రకటించింది. ఈనెల 15వ తేదీ నుంచి కొత్త సర్వీసులు అందుబాటులోకి రానున్నాయని తెలిపింది. ఈ బస్సుల్లో సాధారణ టికెట్‌ ధరలే ఉంటాయని.. మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చునని వెల్లడించింది.
ఎయిర్​పోర్టుకు వెళ్లేందుకు కొత్తగా ఈ 5మార్గాల్లో బస్సులు

రూటు నంబరు 295ఏ: కేపీహెచ్‌బీ మెయిన్‌ రోడ్డు-రాజీవ్‌గాంధీ విమానాశ్రయం మధ్య 4 ఆర్డినరీ బస్సులు వేశారు.

రూటు నంబరు 229/95ఏ: సుచిత్ర – విమానాశ్రయం మధ్య 5 మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు నడపనున్నారు.

రూటు నంబరు 3కె/95ఏ: ఈసీఐఎల్‌ క్రాస్‌ రోడ్సు – విమానాశ్రయం మధ్య 4 మెట్రో ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు తిప్పనున్నారు.

రూటు నంబరు 303 బస్సు కొండాపూర్‌ – విమానాశ్రయం మధ్య 4 సిటీ ఆర్డినరీ సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు.

రూటు నంబరు 90ఎల్‌/251ఏ బస్సు సికింద్రాబాద్‌ – విమానాశ్రయం మధ్య 4 మెట్రో ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు నడపనున్నారు.