వ్యాపారి మధుసూదన్ రెడ్డి కిడ్నాప్, హత్యకేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వ్యాపారిని అతని స్నేహితులు గంజాయి మాఫియా హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. కాగా, మధుసూదన్ రెడ్డి, సంజయ్, జగన్నాథ్‌లు కలిసి గంజాయి వ్యాపారం చేస్తున్నారు. ఈ క్రమంలో మధుసూదన్ రెడ్డి నుంచి రూ.40 లక్షలను సంజయ్ అప్పుగా తీసుకున్నాడు.
కొన్ని రోజులకి డబ్బు తిరిగి ఇవ్వాలని సంజయ్‌పై మధుసూదన్ రెడ్డి ఒత్తిడి తీసుకొచ్చాడు. దీంతో.. నిందితులు బీదర్‌లో డబ్బు ఇస్తామని చెప్పి కారులో కిడ్నాప్ చేశారు. ఈ క్రమంలో.. పాతబస్తీ సమీపంలో మధుసూదన్‌రెడ్డిని హత్య చేశారు. ఆ తర్వాత సంగారెడ్డి సమీపంలోని ఒక ఫామ్‌హౌస్‌లో మధుసూదన్ రెడ్డి మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్లు సంజయ్ పోలీసులు విచారణలో తెలిపాడు .