గుండె వ్యాధులు ఉన్నవారికి, భవిష్యత్తులో గుండె పోటు వస్తుందేమో అని ఇప్పటి నుండే ఆందోళన చెందేవారికి ఒక శుభవార్త. అదేంటంటే రోజు చీజ్(వెన్న) తినడం వల్ల గుండె వ్యాధుల ముప్పు తప్పుతుందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. రోజూ అగ్గిపెట్టె అంత పరిమాణం ఉన్న చీజ్ తినడం వల్ల 14 శాతం వరకు గుండె వ్యాధుల ముప్పు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది ఆ అధ్యయనంలో వైద్యులు తేల్చారు. చీజ్ లో ఉండే విటమిన్లు, మినరల్స్, కాల్షియం గుండెకు మేలు చేస్తాయి కాబట్టి గుండె నొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయని పరిశోధకులు అంటున్నారు. రోజుకు దాదాపు 40 గ్రాముల చీజ్ తినేవారిలో మంచి ఫలితాలు కనిపించాయని చీజ్ చెడు కొవ్వును తగ్గించి, శరీరానికి మేలు చేసే మంచి కొవ్వును పెంచుతుందని అధ్యయనంలో వివరించారు.