లాస్ ఏంజెల్స్ పశ్చిమ పరిసర ప్రాంతాల్లో ఇంకా కాలిఫోర్నియాలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం వల్ల చాలా మంది ఆశ్రయం కోల్పోతున్నారు. అమెరికా అడవుల్లో మరోసారి రగులుతున్న కార్చిచ్చు వల్ల అక్కడ ఉండే నివాసులు సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారని స్థానిక మీడియా వెల్లడించింది. 10 వేల మంది వెస్ట్ లాస్ ఏంజెల్స్ నివాసులు తరలి వెళ్లారని సమాచారం. దాదాపు లక్షన్నర మంది ఉత్తర కాలిఫోర్నియా, సోనోమా కంట్రీ ప్రాంతాలలో అగ్ని ప్రమాదానికి బాధితులుగా మిగిలారని మీడియా ద్వారా తెలిసింది.
ప్రస్తుతం స్పేస్ స్టేషన్లో ఉన్న వ్యోమగామి అండ్రూ మోర్గాన్ కాలిఫోర్నియా అడవుల్లో చెలరేగిన మంటల ఫొటోలు తీశాడు. అమెరికా అంతరిక్ష సంస్థకు చెందిన వ్యోమ గామి అండ్రూ మోర్గాన్ కార్చిచ్చుకు సంబంధించిన ఫొటోలను ట్విటర్లో షేర్ చేశాడు. అంతరిక్షం నుంచి కాలిఫోర్నియా అడవుల్లో చెలరేగిన మంటల ఫొటోలు షేర్ చేస్తూ ఇందులో ఇళ్లు కోల్పోయిన వారి గురించి ఇంకా బాదితులని కాపాడిన సాహసవంతుల గురించి ఆలోచిస్తున్నా అని ట్విటర్ ద్వారా తన అభిప్రాయాన్ని తెలిపారు.
వ్యోమగామి అండ్రూ మోర్గాన్ ట్వీట్‌పై నెటిజన్లు స్పందిస్తూ ఇంత స్పష్టత ఉన్న లెన్సులు అంతరిక్షంలో ఉన్నాయా అని సందేహం వ్యక్తంచేశారు. ఇంకా కొందరు నెటిజన్లు ఇంతగొప్ప టెక్నాలజీని ఉపయోగిస్తున్న మనం కానీ ఇలాంటి కార్చిచ్చు సంబవించకుండా జాగ్రత్త పడలేకపోతున్నాం అని కామెంట్ చేశారు.