ఆమ్రపాలి నుండి 150 కోట్లు ఇప్పించాలని కేసు వేసిన ధోని

Captain Dhoni sues Amrapali group over Rs 150 crore dues

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

అదేమిటి మన వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలికి ధోని నోటీసులివ్వడం ఏమిటి అది కూడా నూటాయాభై కోట్లు ఇప్పించమని కేసు వేయడం ఏంటి పాపం మొన్నే పెళ్ళి చేసుకుని సుఖంగా ఉంటేను అని ఆశ్చర్యపోతున్నారా, ఆమ్రపాలి అంటే మన కలెక్టర్ ఆమ్రపాలి కాదండోయ్. ఆమ్రపాలి అంటే భారత్ లోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ. ఆమ్రపాలి గ్రూప్ తనకు చేసిన అన్యాయం మీద ఆయన కోర్టుకు వెళ్లాడు. ఆమ్రపాలి గ్రూప్ మీద న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు ధోనీ.

అసలు విషయంలోకి వెళితే గత 6-7 సంవత్సరాల నుంచి మహేంద్రసింగ్ ధోనీ ఆమ్రపాలి సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్నారు. అయితే తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో పడిన ఆమ్రపాలి గడువులోగా హౌసింగ్ ప్రాజెక్టు పనులు పూర్తిచేయకపోవడంతో గృహ వినియోగదారులు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహంవ్యక్తం చేశారు. సదరు నిర్మాణ సంస్థ ప్రచార బాధ్యతల నుంచి తప్పుకోవాలని కోరుతూ పలు ట్వీట్లను ధోనీకి ట్యాగ్ చేశారు. దీంతో ఏప్రిల్ 2016లో రియాల్టీ సంస్థ ప్రచారకర్త బాధ్యతల నుంచి ధోనీ తప్పుకున్నాడు. ప్రస్తుతం ఈ సంస్థ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది.

అయితే తాను ప్రచార బాధ్యతల నుండి తప్పుకున్నాప్రచారకర్తగా పనిచేసిన రోజుల్లో సంస్థ తనకు సుమారు రూ.150కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని ధోని ఫిర్యాదులో పేర్కొన్నారు. మాములుగా స్టార్ క్రికెటర్ల బ్రాండింగ్ వ్యవహారాలను రితీ స్పోర్ట్స్ పర్యవేక్షిస్తోంది. ఈ నేపథ్యంలో అమ్రపాలికి మీద ధోనీ తరపున ఢిల్లీ హైకోర్టులో రితీ స్పోర్ట్స్ సంస్థ దావా దాఖలు చేసింది.

2011 ప్రపంచకప్‌లో టీమిండియా వరల్డ్ కప్ గెలిచిన నేపథ్యంలో జట్టులోని ప్రతిఒక్క ఆటగాడికి నోయిడాలోని ఆమ్రపాలి డ్రీమ్ వ్యాలీ ప్రాజెక్టులో రూ.9కోట్ల విలువ చేసే అద్భుతమైన ఇండిపెండెంట్ విల్లాను గిప్ట్‌గా ఇస్తానని 2016లో ఆమ్రపాలి సంస్థ ప్రకటించింది. ప్రకటించినట్టుగానే ధోనీకి రూ.కోటి విలువ గల విల్లాను ప్రజెంట్ చేసిన సంస్థ… మిగతా జట్టు సభ్యులకు మాత్రం రూ.55 లక్షల విలువగల విల్లాలను బహుకరించింది.