దిగొచ్చిన ‘మా’…శ్రీ రెడ్డి మీద నిషేధం ఎత్తివేత

MAA Association U turn On Sri Reddy Ban -Press Meet On Sri reddy Leaks

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

టాలీవుడ్‌లో అవకాశాల కోసం వచ్చే వారి మీద లైంగిక వేధింపులు జరుగుతున్నాయంటూ, అలాగే అతనకి మా మెంబర్ షిప్ ఇవ్వడం లేదు అంటూ ఫిల్మ్ ఛాంబర్‌ ముందు అర్ధనగ్న నిరసన తెలపడంతో శ్రీరెడ్డికి ‘మా’ సభ్యత్వం నిరాకరించడంతో పాటు ఆమె మీద నిషేధం విధించి ‘మా’లో ఉన్న 900 మంది ఆమెతో నటించరంటూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (‘మా’) సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ‘మా’ తీసుకున్న ఈ కఠిన నిర్ణయం పట్ల తీవ్రస్థాయిలో మండిపడుతూ తన ఉద్యమాన్ని మరింత ఉదృతం చేసి ప్రముఖుల ఫోటోలు, కొన్ని చాట్ స్క్రీన్ షాట్ లు బయటపెట్టడంతో ఆమె చేస్తున్న పోరాటానికి ప్రజా, విద్యార్ధి సంఘాల నుండి ఊహించని స్థాయి మద్దతు లభించింది. ఇదే సమయంలో ఆమె మీద విధించిన బ్యాన్ విషయమయి జాతీయ మానవ హక్కుల సంఘం కూడా కల్పించుకోవడం తో ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ తీసుకున్న నిర్ణయాన్ని తొలుత స్వాగతించిన వారు కూడా ఇప్పుడు వ్యతిరేకిస్తున్న పరిస్థితి.

ఎందుకొచ్చిన తంటా అనుకున్నారో ఏమో శ్రీరెడ్డి విషయంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) వెనక్కి తగ్గుతూ.. ఆమెపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు మా ప్రకటించింది. నిన్న ఓ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా ఈ విషయాన్నీ ప్రకటించారు. తమకి శ్రీరెడ్డి మీద వ్యక్తిగత ద్వేషాలు లేవని ఆమె ఇండస్ట్రీపై చేసిన ఆరోపణలు, చర్యల కారణంగా మనస్తాపానికి లోనై, ఆరోజు మనస్థాపంతోనే ఆమెపై బ్యాన్ విధించామన్నారు. నిషేధంపై పున:పరిశీలించాలని ‘మా’ సభ్యులు కోరడంతో ఈ విషయం మీద చర్చించి ఆమెపై నిషేధం ఎత్తివేస్తున్నామన్నారు. ఆమె మీద నిషేధాన్ని ఎత్తేయాలని కొందరు ఆర్టిస్టులు కోరడంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. అంతేగాక టాలీవుడ్ లో నటీమణులపై వేధింపులు అరికట్టడమే లక్ష్యంగా ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు, దానికి కమిటీ అగైనెస్ట్ సెక్యువల్ హెరాస్‌మెంట్ (క్యాష్) అని పేరు పెట్టినట్లు చెప్పారు. ఇతర మా సభ్యుల మాదిరిగానే ఆమెకు అవకాశాలు వచ్చే విధంగా మేం సహాయం చేస్తామని ఇప్పటికే తేజ రెండు చిత్రాల్లో నటించే అవకాశాన్ని ఇచ్చారని శివాజీ రాజా తెలిపారు.