రొంపిచర్ల మండలం తంగెడమల్లి మేజర్ కాలువ వద్ద శుక్రవారం ఉదయం కారు ప్రమాదం చోటుచేసుకుంది. కాలువలో కారు బోల్తా పడి నలుగురు వ్యక్తులు మృతి చెందారు. మాధవ్ మేస్త్రి అనే వ్యక్తి కారులో హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా పామర్రులోని రమణయ్య ఇంట్లో కార్పెంటర్ పనికి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. కారులో అయిదుగురు ప్రయాణిస్తుండగా మహేష్, ఆనంద్, బీర్గౌడ్, అతని కుమారుడు బాలాజీ మృతి చెందారు. మృతదేహాలను నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.