మలక్ పేట్ డీమార్ట్ ఎదురుగా కారు బీభత్సం సృష్టించింది. 72 ఏళ్ల వృద్ధుడు హోండా సిటీ కారుతో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ సమీపంలోని ఓ టీ కొట్టులోకి దూసుకెళ్లాడు. ఈ ఘటన మంగళవారం స్థానికంగా కలకలం రేపింది.
ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. దీంతో కారు డ్రైవింగ్ చేసిన వృద్ధుడు రిటైర్డ్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పోలీసులు గుర్తించారు. అనంతరం అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.