కబళీంచిన మృత్యువు: ప్రమాదంలో కార్లు ఢీ.. ఒకరు మృతి

ప్రపంచమంతా కరోనా బారిన పడి వణికిపోతుంది. దీంతో దేశంలో లాక్ డౌన్ ప్రకటించడంతో ఎక్కడివారు అక్కడే ఉన్నారు. కొందరు చాలా జాగ్రత్తగా సొంతూరుకు చేరుకొని ఊపిరి ఉంటే ఉప్పుగళ్లు అమ్ముకొని బ్రతకవచ్చని పట్టణాలను ఖాలీ చేసి నానా అగచాట్లు పడి నడుక దారినో.. సొంతూర్లకు ఏదో ఒకరకంగా తల్లిదండ్రుల వద్దకు చేరుకోవాలని తాపత్రయ పడుతున్నారు.

అందులో భాగంగా రాజస్థాన్‌కు తిరిగి వెళుతున్న 35 ఏళ్ల ఫ్యాక్టరీ కార్మికుడు నేలమంగళ సమీపంలో బెంగళూరు-తుమకూరు రహదారిపై జరిగిన కారు ప్రమాదంలో మృతి చెందాడు. అతడు రాజస్థాన్ లోని బయాదరహళ్లి నివాసి. జలోర్ స్థానికుడైన లక్ష్మణ్ సింగ్.. తన స్నేహితులు జగమల్ సింగ్, జితేంద్ర, కిమ్ సింగ్ లతో కలిసి కారులో తెల్లవారుజామున 2గంటలకు వెళ్తున్నారు.

అయితే అదే సమయంలో నేలమంగళ సమీపంలో కారు ఆగిపోవడంతో చూద్దామని దిగాడు. బెంగళూరు నుండి అతి వేగంగా వస్తున్న మరో కారు అతనిని ఢీ కొట్టింది. రెండు వాహనాల మధ్య ఇరుకున్న లక్ష్మణ్ అక్కడికక్కడే మరణించాడు. నిందితుడు భయబ్రాంతులకు గురై.. అక్కడి నుండి పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడి కోసం దర్యాప్తు చేస్తున్నారు.