చెట్టును ఢీకొన్న కారు

చెట్టును ఢీకొన్న కారు

జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు అదుపు తప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృత్యువాత పడగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన మారేడుమిల్లికి రెండు కిలోమీటర్ల దూరంలో ఆదివారం జరిగింది.

ఈ మధ్యాహ్నం పాల్వంచనుంచి మారేడుమిల్లి వైపు వెళుతున్న ఓ కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో అందులోని ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గాయపడ్డ వారిని అత్యవసర వైద్యం కోసం హుటాహుటిన దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.