కారు డ్రైవింగ్ నేర్చుకునే సరదా నిండు ప్రాణాన్ని బలికొన్న ఘటన స్థానిక రాణిగుడ ఫారం గ్యాస్గొడౌన్ సమీపంలోని మైదానంలో చోటుచేసుకుంది. ఐఐసీ రస్మీరంజన్ ప్రధాన్ తెలిపిన వివరాల ప్రకారం.. కరుణాకర్ బెహరా అనే యువకుడు స్థానిక మైదానంలో కారు డ్రైవింగ్ నేర్చుకుంటున్నాడు.
అదే సమయంలో రాణిగుడ ఫారం నకు చెందిన మంగ సొపొరి కూలి పనులను చేసుకునేందుకు ఆ మార్గంలో వెళ్తోంది. కారు అదుపుతప్పి, ఆమెను ఢీకొనడంతో తీవ్రగాయాల పాలైంది. స్థానికులు ఆమెను జిల్లా కేంద్రాస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందింది. దీనికి సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు కరుణాకర్ బెహరా, కారును అదుపులోకి తీసుకున్నారు.