ఇటీవల బాలీవుడ్ యాక్టర్ రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ సినిమా ఆనిమల్ ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి సక్సెస్ ని సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం పలు ప్రాజక్ట్స్ తో బిజీగా ఉన్నారు రణబీర్.
విషయం ఏమిటంటే, మొన్నటి క్రిస్మస్ పండుగ సందర్భంగా రణబీర్ కపూర్ ఫ్యామిలీ ఏర్పాటు చేసిన క్రిస్మస్ లంచ్ లో భార్య అలియా భట్ తో కలిసి పాల్గొన్నారు రణబీర్ కపూర్, అందులో భాగంగా కేక్ ని వెలిగించే సమయంలో జై మాతాది అని అంటూ రణబీర్ కపూర్ అనడం, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం జరిగింది. అయితే తాజాగా ఆ వీడియో చూసిన సంజయ్ తివారి అనే వ్యక్తి యాక్టర్ రణబీర్ కపూర్ పై కేసు వేశారు.
ఆ పార్టీలో భాగంగా రణబీర్ పలువురి మతపరమైన మనోభావాలను కించపరిచాడని ఘట్కోపర్ పోలీస్ స్టేషన్ లో స్వయం ప్రకటిత సనాతన ధర్మ బోధకుడు సంజయ్ కేసు పెట్టారు. అయితే ఇప్పటివరకు దానికి సంబంధించి ఎటువంటి ఎఫ్ ఐ ఆర్ నమోదు కాలేదని తెలుస్తుంది .