నటుడు నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతిపై కేసు నమోదైంది. నరేష్ పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తోందంటూ ఆమెపై గచ్చిబౌలి పోలిస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. నటుడు నరేష్‌కు రమ్య రఘుపతి మూడో భార్య. మాజీ మంత్రి రఘువీరారెడ్డి తమ్ముడి కుమార్తె ఈమె. ఎనిమిదేళ్ల క్రితం వీరికి వివాహమైంది. అయితే కొన్నాళ్ల క్రితం మనస్పర్థలు రావడంతో విడిపోయారు.
అయితే నరేష్ సహా ఆయన కుటుంబంతో దిగిన ఫోటోలను అడ్డు పెట్టుకొని కొందరు మహిళల నుంచి భారీగా డబ్బు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. నరేష్‌కు చెందిన ఆస్తులను తన ఆస్తులుగా చెప్పి అధిక వడ్డీ పేరుతో, రిజిస్ట్రేషన్ల పేరుతో కోట్లల్లో మోసానికి పాల్పడింది.
దీనిపై గచ్చిబౌలి పోలిస్ స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది.తాజాగా ఈ వివాదంపై స్పందించిన నటుడు రమ్య వసూళ్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పాడు. కాగా ప్రస్తుతం నరేష్‌తో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్ల కొడుతున్నాయి.