మెగా డాటర్ నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్య న్యూసెన్స్ కేసులో ఇరువర్గాలు రాజీ కుదుర్చుకున్నట్లు తెలుస్తుంది. చైతన్య అర్ధరాత్రిపూట గొడవ చేస్తూ తమకు ఇబ్బంది కలిగిస్తున్నాడని అపార్ట్మెంట్ వాసులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకున్న చైతన్య అక్కడే ఆఫీస్ పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాడట. గత కొన్ని రోజులుగా ఫ్లాట్‌కు కొంతమంది యువకులు వస్తున్నారని, వారు మద్యం తాగి నానా హంగామా సృష్టిస్తున్నట్లు అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలో అపార్ట్మెంట్ వాసులపై కూడా చైతన్య తిరిగి ఫిర్యాదు చేశాడు. తమ వ్యక్తిగత జీవితానికి అపార్ట్మెంట్ వాసులు భంగం కలిగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇరువురి వాదనలు విన్న పోలీసులు విచారణ జరిపారు. మంగళవారం నాడు జరిగిన వాగ్వాదానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్‌ను సేకరించిన పోలీసులు ఇరువర్గాలకు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు సమాచారం.దీంతో ఇరువరు రాజీ వచ్చారని, కేసును వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తుంది. కాగా చైతన్య జొన్నలగడ్డతో నిహారిక కొణిదెల వివాహం డిసెంబర్ 9న ఉదై విలాస్ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.