ప్రముఖ దర్శకుడు దివంగత దాసరి నారాయణరావు రెండో కుమారుడు దాసరి అరుణ్‌కుమార్‌పై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. వివరాల ప్రకారం.. గురువారం తెల్లవారుజామున అరుణ్‌కుమార్ కారు బీభత్సం సృష్టించింది. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ 2 బైకులను ఢీ కొట్టిన ఘటనలో బాధితుల ఫిర్యాదు మేరకు అరుణ్‌కుమార్‌పై కేసు నమోదైంది.
ఆ సమయంలో అతడు మద్యం సేవించి ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. బ్రీత్ అనలైజర్ టెస్ట్‌లోనూ 405 పాయింట్లు నమోదైనట్లు సమాచారం. యాక్సిడెంట్‌కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ని సైతం పోలీసులు పరిశీలిస్తున్నారు. కాగా అరుణ్‌కుమార్ ఇప్పటికే సామాన్యుడు, చిన్న, ఆది విష్ణు వంటి పలు సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. కాగా అరుణ్‌కుమార్ ఇప్పటికే సామాన్యుడు, చిన్న, ఆది విష్ణు వంటి పలు సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే.