ట్రైనీ ఐపీఎస్ అధికారిపై వరకట్న వేధింపు కేసు నమోదైంది. తనను ప్రేమించి పెళ్లి చేసుకుని మోసం చేశాడని ట్రైనీ ఐపీఎస్ మహేష్‌పై భావన అనే మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు మహేష్ పై వేధింపుల కేసు నమోదు చేశారు.ఉస్మానియా యూనివర్శిటీలో చదువుకున్నప్పటినుంచి తాము ప్రేమించుకున్నామని ఆమె ఫిర్యాదులో తెలిపింది.
2018లో పెళ్లి చేసుకున్నామని వివరించింది. తొమ్మిదేళ్ల ప్రేమ తర్వాత ఆర్యసమాజ్‌లో తాము పెళ్లిచేసుకున్నట్లు తెలిపింది. మంచి జాబ్ తెచ్చుకున్న తర్వాత తన తల్లిదండ్రులను ఒప్పిస్తానని చెప్పాడని భావన వివరించింది.
మహేష్ ఐపీఎస్ అధికారిగా సెలక్ట్ అయిన తర్వాత నుంచి తనను పక్కన పెట్టాడని ఆమె వాపోయింది. తనను పెళ్లి చేసుకుని ఇప్పుడు తెలియదని చెబుతున్నాడని తెలిపింది. భావన ఫిర్యాదు మేరకు జవహర్‌నగర్ పోలీసులు మహేష్‌పై కేసు నమోదు చేశారు.మహేష్ ప్రస్తుతం హైదరాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీసు అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు.
మహేష్ సివిల్స్ కు సెలెక్ట్ కావడానికి తాను ఎంతో కృషి చేశానని… జీవితాన్ని నష్టపోయానని భావన చెప్పుకొచ్చింది. ఎమ్మెల్యేలు, ఎంపీల పేర్లు చెప్పి తనను బెదిరించాడని తెలిపింది.