రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై రామగిరి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. వైసీపీ కార్యకర్తల తోపులాటలో గాయపడిన కానిస్టేబుల్ నరేంద్ర కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రకాష్ రెడ్డిపై పోలీసులు కేసు నమెదు చేశారు. హెలీప్యాడ్ దగ్గరకు కార్యకర్తలు అందరూ వెళ్లాల్సిందేనని తోపుదుర్తి పట్టుబట్టారు. డీఎస్పీతో హెలీప్యాడ్ వద్ద ప్రకాష్ రెడ్డి వాగ్వాదానికి దిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రకాష్ రెడ్డి కార్యకర్తలను రెచ్చగొట్టడంతోనే జగన్ హెలికాప్టర్‌లో వచ్చిన సమయంలో బారికేడ్లు తోసుకొని కార్యకర్తలు లోపలికి వచ్చినట్లు తెలుస్తోంది.