కాస్టింగ్‌ కౌచ్‌ ఇకనైనా ఆగేనా?

Casting Couch Will End In Tollywood Film Industry With Cash Committee

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

సినిమా పరిశ్రమలో గత కొంత కాలంగా జరుగుతున్న సంఘటలకు, సినిమా పరిశ్రమపై కొంతమంది చేస్తున్న ఆరోపణలకు సమాధానంగా ఒక కమిటీ వేయడం జరిగింది. సినిమాకు సంబంధించిన 24 విభాగాల వారు మరియు సినిమాకు సంబంధం లేని వారు ఈ కమిటీలో ఉంటారు. సినిమా ఛాన్స్‌ల కోసం వచ్చే అమ్మాయిలను కోఆర్డినేటర్లు మరియు ఇతరులు వాడేసుకోవాలని చూస్తున్నారంటూ శ్రీరెడ్డి ఇటీవల తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. తాజాగా ఆ విషయమై కూడా కమిటీలో చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. జూనియర్‌ ఆర్టిస్టుల భద్రతకు పలు చర్యలు తీసుకుంటున్నట్లుగా కమిటీలో కీలక వ్యక్తి అయిన దర్శకుడు శంకర్‌ పేర్కొన్నారు.

కమిటీ నిర్ణయాల మేరకు ఇకపై కొత్తగా సినిమా పరిశ్రమలోకి రావాలనుకునే వారికి కౌన్సిలింగ్‌ ఇచ్చేందుకు ఒక టీంను ఏర్పాటు చేయనున్నాం. వారి భద్రతకు సంబంధించిన అన్ని విషయాలను చూసుకునేందుకు ఒక టీం పని చేస్తుందని, ఆడిషన్స్‌ చేసే సమయంలో ఖచ్చితంగా కెమెరాలు ఉండేలా చర్యలు తీసుకుంటామంటూ శంకర్‌ చెప్పుకొచ్చారు. అయితే ఎన్ని చేసినా కూడా ఇండస్ట్రీలో కాస్టింగ్‌ కౌచ్‌ అనేది పూర్తిగా తొలగించడం కష్టమే అని, ఆడవారు అవకాశాలు కావాలని భావిస్తే సినిమా పరిశ్రమలోని కొందరు వారి నుండి శరీరాన్ని కోరడం, అందుకు వారు తప్పనిసరి పరిస్థితుల్లో ఓకే చెప్పడం అనేది జరుగుతూనే ఉంటాయని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ సినిమా పరిశ్రమ వారు తీసుకున్న చర్యల వల్ల కాస్టింగ్‌ కౌచ్‌ అనేది లేకుండా పోతే అంతకంటే మంచి విషయం ఏమీ ఉండదని కొందరు అభిప్రాయపడుతున్నారు.