ఈ సీబీఐ బ్యాన్ వెనుక అసలు కధ ఇదేనా…?

Cbi Must Seek Permission To Enter Into State Ap Govt Sensational Step

కేంద్రంలో సీబీఐ వివాదం దూమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో సీబీఐకి ఆంధ్ర ప్రదేశ్ లో దాడులు, దర్యాప్తు చేసే అధికారాన్ని నిరాకరిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సీబీఐ ప్రవేశానికి వెసులుబాటు కల్పించే ‘సమ్మతి’ ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. గతంలో ఇచ్చిన సమ్మతి నోటిఫికేషన్‌ను విత్‌ డ్రా చేసుకుంటూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ మినహా మిగతా రాష్ట్రాల్లో అయినా కేంద్ర ప్రభుత్వ సంస్థ సిబిఐ ప్రవేశించాలంటే, అక్కడి కేసులపై విచారణ చేయాలంటే, ఆ రాష్ట్ర అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీ మాత్రం ఇందుకు మినహాయింపు. దాదాపు అన్ని రాష్ట్రాలు ఎప్పటినుంచో దీనికి సమ్మతిస్తూ కేంద్ర ప్రభుత్వంతో నిబంధన చేసుకొని ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో సి.బి.ఐ.ని అనుమతిస్తూ ఎప్పటినుంచో ఉన్న ఈ ఉత్తర్వుల ని ఇప్పుడు ఉపసంహరిస్తూ తీసుకున్న సంచలన నిర్ణయం కారణంగా ఇక మీదట సిబిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి విచారణ చేయాలన్నా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ప్రత్యేకంగా తీసుకోవాల్సి ఉంటుంది.

Telangana TDP Releases First List Of 9 Candidates

రాష్ట్రంలో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి మీద విచారణ చేయాలన్నా కూడా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పర్మిషన్ తీసుకోవాల్సిందే. ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను చెబుతూ సిబిఐ సంస్థ ప్రతిష్ట మసకబారిన కారణంగానే, తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలుగుదేశం నేతలు, ఆ పార్టీ అభిమానులు అంటున్నారు. తెలుగుదేశం పార్టీ అభిమానులలో మాత్రం ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతోంది. చంద్రబాబు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చాడని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ నిర్ణయంపై విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను విచారించడానికి కూడా సీబీఐకి అధికారం ఉండదు. తద్వారా రాష్ట్రంలో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై కూడా రాష్ర్ట ఏసీబీనే దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను శాఖ, పోర్టులు, తపాలా కార్యాలయాలు, సెంట్రల్‌ ఎక్సైజ్‌, టెలిఫోన్‌ కార్యాలయాలు, వాటిలోని ఉద్యోగులపై దాడులు చేయడానికి, సోదాలు నిర్వహించేందుకు, కేసులు నమోదు చేసి దర్యాప్తు చేసేందుకు వీలవుతుంది.

CBI

ఈ అధికారాలన్నింటినీ సమీప భవిష్యత్తులో ఏసీబీ వినియోగించుకునేందుకు కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో సీబీఐ తనకు దఖలు పడిన అధికారాలను సమర్థంగా వినియోగించుకోలేకపోతోందని సీనియర్ న్యాయవాది ఒకరు రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చారు. సీబీఐతో పోలిస్తే రాష్ట్ర సంస్థలే మెరుగ్గా, ఆధునికంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర పరిధిలో జరిగే నేరాలను దర్యాప్తు చేసే సమర్థత రాష్ట్ర సంస్థలకే ఉన్నందున సీబీఐని ఆశ్రయించాల్సిన పనిలేదని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో జారీ చేసిన సమ్మతి నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకోవాలని కోరారు. సీనియర్ న్యాయవాది ఇచ్చిన వినతి పత్రంపై రాష్ట్ర ప్రభుత్వం సుదీర్ఘంగా చర్చించింది. రాజకీయ కక్షలతోనే ఏపీలో వరుసగా దాడులు జరుగుతున్నాయని మంత్రివర్గం అభిప్రాయపడింది. దీంతో ఆగస్టులో జారీ చేసిన సమ్మతి నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది.

cbi