బాబు ఎక్కడా తగ్గట్లేదుగా !

CBN Counter To Manikyala Rao

క్ర‌మ‌శిక్ష‌ణ విష‌యంలో క్లాసు పీక‌డంలో చంద్ర‌బాబు ఆయనకు ఆయనే సాటి. ఎవ‌రైనా ఉత్తినే నింద వేస్తే అస్స‌లు స‌హించ‌రు. ఇంత‌కుముందు కొన్నిటిని ప‌ట్టించుకోకుండా వ‌దిలేసేవారు. అయితే ఈ మధ్య మాత్రం ఎవ‌రు ఏమ‌న్నాచంద్ర‌బాబు ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా రిటార్ట్ ఇస్తున్నారు. మొన్న కేసీఆర్ రిట‌ర్న్ గిఫ్ట్ పై అడుగ‌డుగునా క‌డిగి పారేసిన బాబు తాజాగా శ్వేత ప‌త్రాలు విడుద‌ల చేస్తూ బీజేపీకి చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నాడు. దీంతో దిక్కుతోచ‌ని బీజేపీ చంద్ర‌బాబు మా త‌ప్పుల‌ను ఎత్తిచూపుతున్నాడు కాబ‌ట్టి ఆయ‌న త‌ప్పుల‌ను మ‌నం ఎత్తిచూపుదాం అని డిసైడ్ అయ్యింది. మంగ‌ళ‌వారం మాజీ మంత్రి, బీజేపీ నేత మాణిక్యాల రావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. రాజీనామా లేఖను స్పీక‌రుకు పంప‌కుండా, త‌న పార్టీకి పంప‌కుండా సీఎం చంద్రబాబుకి పంపిన‌పుడే వారి రాజ‌కీయం అంద‌రికీ అర్థ‌మైంది. పైగా రాజీనామాతో పాటు రాసిన లేఖ‌లో ఆయ‌న వ‌ల్లెవేసిన నీతులు మామూలుగా లేవు. వాటిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు.

పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని చెప్పారు. మీ ఒక్క నియోజకవర్గమే కాదు రాష్ట్రం మొత్తాన్ని అభివృద్ధి చేయడం నా బాధ్యత అని మాణిక్యాలరావుని ఉద్దేశించి గ‌ట్టి రిప్ల‌యి ఇచ్చారు. మీ పార్టీ కేంద్రంలో ఏం చేస్తోంది? మీరు జన్మభూమికి ఏం చేస్తున్నారు? అని చంద్రబాబు ప్రశ్నలు సంధించారు. చిల్లర రాజకీయాలు చేయడం రాజీనామా పేరుతో బెదిరించడం కరెక్ట్ కాదని హితవు పలికారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రంతో పోరాడి రాజీనామా చేసి ఉంటే బాగుండేదని చంద్రబాబు ఎద్దేవా చేశారు. మరోపక్క నరేంద్రమోడీ ఆరో తేదీన గుంటూరు సభలో ప్రసంగించనున్నారు. బీజేపీ ఈ సభపై టెన్షన్ పడుతోంది. మోడీకి స్వగతాలు అటుంచి నిరసనలే ఎక్కువగా వినిపిస్తే.. సమస్య అవుతుందని ఆందోళన చెందుతోంది.