చిరంజీవి నిరూపించుకున్నారు

చిరంజీవి నిరూపించుకున్నారు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తో సినీ ప్రముఖులు భేటీ విజయవంతంగా ముగిసింది. అనంతరం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో సినీ ప్రముఖులు మాట్లాడారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమ సమస్యలకు శుభంకార్డు పడిందని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని సీఎం జగన్‌ తీసుకున్నారని, ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

‘విశాఖను సినిమా హబ్‌గా తయారు చేస్తామని సీఎం జగన్‌ అన్నారు. తెలంగాణలో చిత్ర పరిశ్రమ ఎలా అయితే అభివృద్ధి చెందిందో ఏపీలో కూడా చిత్ర పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడతాం అని సీఎం జగన్‌ అన్నారు. దేశవ్యాప్తంగా తెలుగు సినిమాలకు మంచి ఆదరణ వస్తోంది. ఏ సమస్య వచ్చినా సామరస్యంగా పరిష్కరించుకుంటాం. ఈనెల చివర్లో జీవో వచ్చే అవకాశం ఉంది. సమావేశం ఏర్పాటు చేయడంలో ప్రత్యేక శ్రద్ద వహించిన సినిమాటోగ్రఫీ మినిస్టర్‌ పేర్ని నానికి ధన్యవాదాలు’ అని మెగాస్టార్‌ చిరంజీవి పేర్కొన్నారు.