రంగ‌స్థ‌లం ట్రైల‌ర్ పై సినీ ప్ర‌ముఖుల స్పందన…

Celebrities Comments On Rangasthalam Trailer

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

రంగ‌స్థ‌లం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విడుద‌లైన థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాలు మరింత పెంచింది. ట్రైల‌ర్ ప్ర‌స్తుతం యూట్యూబ్ ట్రెండింగ్ లో మొద‌టిస్థానంలో ఉంది. సామాన్య ప్రేక్ష‌కులే కాక‌… సినీ ప్ర‌ముఖులు కూడా ట్రైల‌ర్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. రామ్ చ‌ర‌ణ్, స‌మంత న‌ట‌న‌ను పొగుడుతూ ట్వీట్లు చేస్తున్నారు. చిట్టిబాబు ప్రియాతి ప్రియంగా మారార‌ని, ట్రైల‌ర్ అత‌డిపై ప్రేమ‌ను ఇంకా పెంచింద‌ని, జగ‌ప‌తిబాబు గంభీరంగా ఉన్నార‌ని, రంగ‌స్థ‌లం విడుద‌ల కోసం ఆతృత‌గా ఎదురుచూస్తున్నాన‌ని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్.ఎస్. రాజ‌మౌళి ట్వీట్ చేశారు. రంగ‌స్థ‌లం ట్రైల‌ర్ సొంత ప్రాంతాన్ని గుర్తుచేసింద‌ని, చ‌ర‌ణ్ త‌న పాత్ర‌లో పూర్తిగా జీవించేశాడ‌ని, స‌మంత ఆ పాత్ర‌లోకి మారిపోయిందని, మొత్తంచిత్ర‌బృందం అద్భుతంగా, నేర్పుతో ప‌నిచేసింద‌ని మ‌రో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శ్రీనువైట్ల కొనియాడారు.

రంగ‌స్థ‌లం ట్రైల‌ర్ చాలా ఆస‌క్తిక‌రంగా ఉంద‌ని, సినిమా విడుద‌ల కోసం ఎదురుచూస్తున్నానని, చిట్టిబాబు సూప‌ర్ అని వ‌రుణ్ తేజ్, చిట్టిబాబు… విజిల్స్… విజిల్స్… అని సాయిధ‌ర‌మ్ తేజ్ ట్వీట్ చేశారు. ఇది మిగిలిన చిత్రాల‌కంటే ప్ర‌త్యేకంగా నిలిచింద‌ని, రంగ‌స్థ‌లం విడుద‌ల‌కోసం ఎదురుచూస్తున్నాన‌ని సుమంత్ ట్వీట్ చేశారు. రంగ‌స్థ‌లం ట్రైల‌ర్ గురించి వివ‌రించ‌డానికి మాట‌లు స‌రిపోవ‌డం లేద‌ని ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి, రంగ‌స్థ‌లం సినిమా ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేక ప్యాకేజీలా ఉంద‌ని మ‌రో ద‌ర్శ‌కుడు బాబీ, చిట్టిబాబు చాలా గ‌ట్టిబాబు అని ద‌ర్శకుడు మారుతి ట్రైల‌ర్ ను ప్ర‌శంసించారు. రంగ‌స్థ‌లం… రామ్ చ‌ర‌ణ్ కు న‌టుడిగా కొత్త ప్ర‌యాణ‌మ‌ని, చెర్రీలో చిట్టిబాబును చూసిన సుకుమార్ కు హ్యాట్సాఫ్ అని, తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ఈచిత్రం నిలిచిపోతుంద‌ని కోన వెంక‌ట్ కొనియాడారు.

1985లో రంగ‌స్థ‌లం అనే ఊరిలో చోటుచేసుకున్న రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఈ సినిమాను తెరకెక్కించిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నెల 30న సినిమా విడుద‌ల‌కానుంది.