Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, హీరోయిన్ కంగనా రౌనత్ ఎపిసోడ్ కి ఇప్పుడప్పుడే బ్రేక్ పడేలా కనిపించడం లేదు. ఈ వ్యవహారం సాధ్యమైనంత తొందరగా ఫేడ్ అవుట్ అయితే బాగుండని హృతిక్ అనుకుంటుంటే, తప్పు తన మీద వేస్తే చూస్తూ ఊరుకుంటానా అన్నట్టు కంగనా వ్యవహరిస్తోంది. నిజానికి ఇలాంటి విషయాల్లో కచ్చితంగా ఏమి జరిగింది అనేది అందులో భాగస్వాములైన ఆ ఇద్దరికి మాత్రమే తెలుస్తుంది. ఆ ఇద్దరి మధ్య వివాదం చెలరేగినప్పుడు ఒక్కొక్కరు తమ కోణంలో రైట్ అనుకున్న దాని గురించే మాట్లాడతారు. జనం దృష్టిలో తమకు ప్రతికూలం అవుతుంది అన్న దానిపై దృష్టి ఉంచరు. అందుకే ఈ ఎపిసోడ్ ఇంతకీ తెగడం లేదు. ఇద్దరూ వేడి మీద వున్నారు కాబట్టి ఆత్మశోధన అన్న మూడ్ ఇప్పుడప్పుడే వచ్చేలా లేదు.
అసలు వివాదంలో ఇరుక్కున్న వాళ్ళే జరిగినదానిపై సమగ్రంగా ఆలోచించలేకపోతుంటే బయటి వాళ్లకి ఇందులో ఏమి అర్ధం అవుతుంది. అయితే మ్యాటర్ లోతులు తెలియకుండానే కొందరు హృతిక్ కి మద్దతుగా మాట్లాడి కంగనాని ఇంకాస్త రెచ్చగొడుతున్నారు. ఈ టాపిక్ తెస్తూ హృతిక్ పేరు లేకుండానే అతను అలాంటి పని చేసి ఉండడు అని ఫర్హాన్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. దాన్ని ట్విన్కిల్ ఖన్నా, యామీ గౌతమ్, సోనాలి బింద్రే, కరణ్ జోహార్ , సోనమ్ కపూర్ లాంటి వాళ్ళు సమర్ధించారు. దీంతో వీళ్లందరినీ ఒక్క గాటన కట్టిన కంగనా సోదరి ఎంత మంది వచ్చినా తన అక్క పోరాడగలదని చెప్పింది. సమస్య లోతులు తెలియకుండా ఇలాంటి తీర్పులు ఇవ్వడం వల్ల అది ఇంకాస్త సంక్లిష్టం కావడం తప్ప ప్రయోజనం ఉంటుందా ?