అతనో సెల్ ఫోన్ మెకానిక్, అతను అమ్మాయిలను మాయమాటలతో బుట్టలో వేసి వారిని లైంగికంగా వాడుకొని అశ్లీల వీడియోలు తీశాడు. తాను చేసిన రాసలీలన్నీ చిత్రీకరించాడు. ఆ వీడియోలను అతడి దగ్గర నుంచి రహస్యంగా కొట్టేసిన మరో వ్యక్తి ఆ బాదితురాళ్ళను డబ్బుల కోసం డిమాండ్ చేశాడు. బేరం కుదరకపోవడంతో కొన్ని వీడియోలను వాట్సాప్ గ్రూపుల్లో పెట్టాడు. ఇవి కాస్త వైరల్ కావడంతో వీడియోల్లో ఉన్న ఓ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండల పరిధిలో జరిగిన ఈ ఘటన అక్కడి వారిని విస్మయానికి గురిచేస్తోంది. వివరాలు ఇలా ఉన్నాయి. మొగల్తూరు మండల పరిధిలోని ఓ గ్రామంలో ఓ యువకుడు సెల్ఫోన్ రిపెయిర్ షాప్ నడుపుతున్నాడు. అతని షాపు వద్దకు వచ్చే అమ్మాయిలకు ఎరవేయడం మొదలుపెట్టారు. కొంత మంది అమ్మాయిలు అతని బుట్టలో పడిపోయారు. ఒకరిద్దరు కాదు ఏకంగా 61 మంది అతనితో లైంగికంగా దగ్గరయ్యారు. ఆ అమ్మాయిలతో ఏకాంతంగా గడిపిన సమయంలో రహస్యంగా వీడియోలు తీశాడు. కానీ, వాటిని అతను బయటపెట్టలేదు. అయితే, సెల్ఫోన్లో తీసుకున్న వీడియోలను అతను తన షాపులోని కంప్యూటర్లో భద్రపరిచాడు. ఆ షాపులో పనిచేసే మరో యువకుడు ఆ వీడియోలను గమనించి తన సెల్ఫోన్లోని ఎక్కించుకున్నాడు. అంతటితో ఆగకుండా వాటిని గ్రామంలోని మరికొందరు స్నేహితులకు పంపాడు. ఈ విషయం తెలుసుకున్న మరో వ్యక్తి వీడియోలన్నింటినీ సేకరించి, వాటి సాయంతో బాధ్యుడిని బెదిరించాడు. డబ్బులు ఇవ్వకపోతే వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని బ్లాక్ మెయిల్ చేశాడు. బేరం కుదరకపోవడంతో కొన్ని వీడియోలను పలు వాట్సాప్ గ్రూపుల్లో ఉంచాడు. దీంతో ఈ వీడియోలు చాలా మందికి చేరిపోయాయి. ఇలా వాట్సాప్లో వైరల్ అయిన వీడియోలను చూసిన ఓ బాధితురాలు మొగల్తూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనకు బాధ్యుడైన యువకుడితో పాటు వీడియోలను చోరీ చేసిన మరో యువకుడిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారి నుంచి వీడియోలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.