ఏపీ లెక్క చెప్పాకే అంటున్న కేంద్రం

central government expenditures in ap for development

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

పీకి ఎన్నో హామీలిచ్చిన బీజేపీ అన్నింటికీ తిలోదకాలిచ్చింది. హోదా ఇస్తామని ప్యాకేజీ ముష్టి పడేసింది. కనీసం అది కూడా సరిగా ఇవ్వకుండా అరకొరగా ఇస్తూ.. చంద్రబాబు సహనాన్ని పరీక్షిస్తోంది. అదేమంటే కేంద్రం ఇచ్చిన డబ్బులు ఎలా ఖర్చు చేశారో లెక్కలు చూపించాలంటోంది. మరి టీడీపీ సర్కారు ఈ తలనొప్పులు దాటుకుని ఎలా నిధులు తెచ్చుకుంటుందో చూడాల్సి ఉంది.

ఏపీ ప్రభుత్వానికి చాలా నిధులిచ్చామని, వాటన్నింటినీ ఖర్చుపెట్టారని, అయితే ఆడిట్ రిపోర్ట్ సమర్పిస్తే కేంద్రం మిగతా నిధులు విడుదల చేస్తుందని కేంద్రమంత్రి పార్లమెంటులో చెప్పడం మరోసారి టీడీపీ ఎంపీలకు చికాకు తెప్పించింది. కావాలంటే వేరే కారణం ఏదైనా చెప్పొచ్చని , కానీ తమ సీఎం చంద్రబాబుదే తప్పని చూపించేలా కారణాలు చెప్పడమేంటని వారు ఫైరౌతున్నారు.

బీజేపీ ఏపీకి సాయంపై దోబూచులాడుతోందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. సరైన సమయం చూసి కేంద్రాన్ని దెబ్బకొడదామంటే అధినేత చంద్రబాబు ఒప్పుకోవడం లేదట. దీంతో మోడీపై కోపమున్నా ఎలా చూపించాలో తెలియక టీడీపీ ఎంపీలు రగిలిపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో బంధం తెంచుకునే దిశగా వెళ్తున్న కమలనాథులకు ఎన్నికల్లోనే షాకివ్వాలనుకుంటున్నారు తమ్ముళ్లు.

మరిన్ని వార్తలు

మోడీ, కేసీఆర్ ఫెవికాల్ బంధం