బాబుకు దగ్గరయ్యే ప్రయత్నం చేసిన గోరంట్ల

Gorantla Buchaiah Chowdary Trying To Close with Chandra Babu Naidue

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

అడుసు తొక్కనేల.. కాలు కడగనేల అనే సామెత గోరంట్ల బుచ్చయ్య చౌదరి విషయంలో సరిగ్గా సరిపోతుంది. గోదావరి జిల్లాల్లో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న ఈయన.. గతంలోనే మంత్రిగా పనిచేశారు. అయినా సరే మొన్నటి క్యాబినెట్ విస్తరణలో పదవి రాలేదని పంతాలకు పోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. జీవితంలో ఒక్కసారి కూడా మంత్రి కానివారు గొడవ చేస్తే అర్థముంది కానీ.. బుచ్చయ్య లాంటి వారు అలకపాన్పు ఎక్కడంపై చర్చ జరిగింది.

అందుకే చంద్రబాబు కూడా వారం రోజుల పాటు బుచ్చయ్యకు కనీసం ఫోన్ కూడా చేయలేదు. అలాగే వదిలేస్తే ఎటూ కాకుండా పోతాననే భయంతో గోరంట్లే బాబును సంప్రదించారు. చివరకు వెళ్లి కలిస్తే.. బాబు మెత్తగా క్లాస్ పీకారు. ఎన్టీఆర్ హయాంలోనే మంత్రిగా చేసి, ఇప్పుడు పదవి కోసం పాకులాడటం సరైన పద్ధతి కాదని హితవు చెప్పారు.

దీంతో బాబు దగ్గర మార్కులు తగ్గిపోయాయని భావించిన గోరంట్ల.. ఉండవల్లి సవాల్ కు స్పందించి సంచలనం సృష్టించారు. ఇప్పిదాకా పట్టిసీమపై ఉండవల్లి మాటలకు టీడీపీ నుంచి సరైన కౌంటర్ రాలేదు. ఇప్పుడు గోరంట్ల ఎంట్రీతో సీన్ రసకందాయంలో పడింది. అటు బాబు కూడా జరిగిన పరిణామాలపై హ్యాపీగా ఉన్నారు. ఉండవల్లిని గోరంట్ల అయితేనే ఎదుర్కోగలరని ఆయన భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు: