పొగతాగడాన్ని నియంత్రించడంలో ఇ-సిగరెట్లు విఫలమయ్యాయని, స్కూల్ పిల్లల్లో పోగతాగడాన్ని ఇవి పెంచాయని పేర్కొన్నారు. అందువల్లే ఇ-సిగరెట్ల ఎగుమతి, దిగుమతి, అమ్మకాలు, ఉత్పత్తి, నిల్వలు, ప్రకటనలపై నిషేధం విధిస్తున్నట్లు వెల్లడించారు.
ఇ-సిగరెట్లపై నిషేధానికి ఆర్డినెన్స్ తీసుకురానున్నారు. ప్రతిపాదిత ఆర్డినెన్స్‌ను ఉల్లంఘించినవారికి గరిష్టంగా ఒక ఏడాది జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తారు.యువత ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇ-సిగరెట్లపై నిషేధానికి నిర్ణయం తీసుకున్నట్లు సీతారామన్ చెప్పారు.
అమెరికాలో చేసిన ఒక అధ్యయనాన్ని ఆమె ఈ సందర్భంగా ఉటంకించారు. అమెరికాలో 10 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థుల్లో ఇ-సిగరెట్ల వాడకం 77.8 శాతం, మాధ్యమిక తరగతి విద్యార్థుల్లో 48.5 శాతం పెరిగినట్లు ఆ అధ్యయనంలో తెలిసిందని చెప్పారు.