ఆధారాలతో సహా బట్టబయలు అయిన కేంద్రం కుట్రలు !

Central govt Funding Dholera City in Gujarat

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

గత కొద్ది రోజులుగా ప్రత్యేక హోదా అంశం మీద విభేదించి విడిపోయిన బీజేపీ టీడీపీలు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు అయితే అమరావతికి నిధులు ఇవ్వకుండా ఎదిపిస్తున్న ప్రధాని సొంత రాష్ట్రంలో మాత్రం ధోలేరా నగరానికి ఎలా నిధులు ఇస్తారని మహానాడు వేదికగా బాబు ప్రశ్నించారు. అయితే బాబు అబద్దపు ప్రచారాన్ని చేస్తున్నారని జివిఎల్ నరసింహారావు కవర్ చేసే ప్రయత్నం చేసి ధొలేరా నగరం డిల్లీ-ముంబై పారిశ్రామిక కారిడార్ లో ఒక పారిశ్రామిక నగరమని, అది కాంగ్రెస్ హయాంలో తీసుకున్న నిర్ణయం అని 2010లో మొదలైన ప్రతిపాదన అని చెప్పుకొచ్చారు. ఇందులో కేంద్రం వాటా కేవలం 2500 కోట్ల రూపాయలు మాత్రమే ఇస్తుందని చెప్పుకొచ్చారు.

ఇది నిన్న జరిగితే ఏదో పగబట్టినట్లు ఎక్కడో గుజరాత్ లోని ధొలేరా పారిశ్రామిక న‌గ‌ర అభివృద్ధి గురించి ఆంధ్రాలో భాజ‌పా ప్ర‌చారం మొద‌లుపెట్టింది. అక్క‌డో అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది అన్న‌ట్టుగా ఏపీలోని ప్ర‌ధాన ప‌త్రిక‌లైన ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షిలో నేడు కేంద్రం ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వ‌డాన్ని ఏపీ ప్రజలని రెచ్చగొట్టే ప్రక్రియగా విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అమ‌రావ‌తికి 33 వేల ఎక‌రాల భూమి అవ‌స‌ర‌మా అంటూ భాజ‌పాతోపాటు, ఆ పార్టీకి మ‌ద్ద‌తు ప‌లికే పవన్ వంటి నాయ‌కులు కూడా విమ‌ర్శ‌లు గుప్పిస్తూనే ఉన్నారు. రాజ‌ధానితోపాటు, పారిశ్రామిక నగ‌రంగా అమ‌రావ‌తిని అభివృద్ధి చేయాల‌న్న బాబు ప్రయత్నాన్ని త‌ప్పుబ‌డుతున్నారు. ఈ క్ర‌మంలో ఆంధ్రా రాజ‌ధానికి కేంద్రం ఎందుకు సాయం చేయ‌డం లేద‌న్న ప్ర‌శ్న‌ను విస్మ‌రిస్తున్నారు.

జీవీఎల్ చెప్పినట్ట్టు ఢిల్లీ-ముంబై పారిశ్రామిక కారిడార్ లో భాగంగానే గుజ‌రాత్ లోని ధొలేరా నిర్మాణం జ‌రుగుతోంది. 2.2 ల‌క్ష‌ల ఎక‌రాల్లో ఈ న‌గ‌రం విస్త‌రించ‌బోతోంది. దీన్లో 5,600 ఎక‌రాలు కోర్ ఏరియా. రాజ‌ధాని అహ్మ‌దాబాద్ తో 10 లేన్ల ఎక్స్ ప్రెస్ ర‌హ‌దారులు నిర్మించ‌బోతున్నారు. గుజ‌రాత్ కి మోడీ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడే ధొలేరా ప్రారంభమైంది. ఆయన ప్ర‌ధాని కాగానే మంచిరోజులు వ‌చ్చాయి. ప్రాజెక్టును అమ‌లు చేయ‌డానికి స్పెష‌ల్ ప‌ర్ప‌స్ వెహిక‌ల్ ను కూడా ఏర్పాటు చేశారు. అయితే, 2007లోనే ఈ ప్రాజెక్టు ప్ర‌క‌టించినా… ప‌నులు వేగ‌వంతంగా ముందుకు సాగ‌లేదు. మోడీ ప్ర‌ధాని అయిన ద‌గ్గ‌ర నుంచీ నిర్మాణం ఊపందుకుంది. కేంద్రం రూ. 2,784 కోట్లు నిధులు పెట్టుబ‌డిగా ఇచ్చింది.

ఏపీ విష‌యానికొస్తే అమ‌రావ‌తిలో రాజ‌ధానికి 33 వేల ఎక‌రాల‌ను ప్ర‌భుత్వం సేక‌రించింది. ధొలేరా కోసం సేక‌రించిన 2.2 ల‌క్ష‌ల ఎక‌రాల ముందు ఇది తక్కువే అందునా ఒక రాష్ట్రానికి రాజధాని. ఏపీ సేక‌రించిన భూమిలో 900 ఎక‌రాల్లోనే ప‌రిపాల‌నా భ‌వ‌నాలు, ఎమ్మెల్యే క్వార్ట‌ర్స్ లాంటివ‌న్నీ నిర్మించాల‌నుకున్నారు. మిగ‌తా భూములు భ‌విష్య‌త్తు అవ‌స‌రాలు.. అంటే, క‌నీసం మ‌రో పాతికేళ్ల‌పాటు న‌గ‌ర విస్త‌ర‌ణ అవ‌స‌రాల‌ను దృష్టిలో పెట్టుకుని సేక‌రించింది. నిజానికి ఆ మాత్రం ముదుచూపు లేకుంటే ఏమౌతుందో బేగంపేట విమానాశ్ర‌య‌మే దానికి ఉదాహ‌ర‌ణ‌. కానీ అహ్మదాబాద్ రాజధానిగా ఉన్న రాష్ట్రంలో మరో నగరానికి రెండు లక్షల ఎకరాలు సేకరిస్తే మాట్లాడని వారు ఈరోజు రాజకీయ ప్రయోజనాల కోసమే తెలుగుదేశం మీద విమర్శలు చేస్తున్నారనేది విశ్లేషకుల వాదన. అయితే ఇప్పుడు అయినా, ధొలేరా గురించి ఆంధ్రా పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాల్సిన అవసరం ఏముంది..? ఏపీ ప్రజలకు ఏం చెప్పాలని మా మార్కు అభివ్రుద్ధి ఇలా ఉండబోతోందని చెప్పాలనా లేక మాతో పెట్టుకుంటే ఎంత నష్టపోతున్నారో తెలుసుకోండని రెచ్చకొట్టే ప్రయతనం చేస్తున్నారా అనేది అర్ధం కావాల్సి ఉందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.