చైనా స్మార్ట్ ఫోన్ బ్రాండ్ హానర్ కొత్త ఫోన్ ను అంతర్జాతీయ మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకు వచ్చింది. హువావే ఉపసంస్థ అయిన హానర్ 20సిరీస్ లో భాగంగా యూత్ఎడిషన్ “హానర్ 20లైట్”ను చైనా మార్కెట్లో లాంచ్ చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బ్లాక్, గ్రీన్, బ్లూ, పింక్ గ్రేడియంట్ రంగుల్లో లభించనుంది.
6.3“ ఓఎల్ఈడీ డిస్ప్లే,కిరిన్ 710F ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 9 పై ఈఎంయూఐ 9.1.1, సెల్పీకెమెరా 16 ఎంపీ,4000ఎంఏహెచ్ బ్యాటరీ ఫీచర్లతో మొత్తం నాలుగు వేరియంట్లు ఈ చైనా స్మార్ట్ ఫోన్లో అందుబాటులో ఉండనున్నాయి.
దీనికి సంబంధించిన ప్రీఆర్డర్లు చైనాలో ప్రారంభంఅవ్వగా అక్టోబర్ 25నుంచి అమ్మకాలు అవ్వనున్నాయి. వాటర్ డ్రాప్ నాచ్ ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్, సూపర్ నైట్ సీన్ మోడ్, ఏఐ సీన్ రికగ్నిషన్ లను కూడా ఈ స్మార్ట్ ఫోన్లో పొందుపర్చారు.