నేడు రైతు దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి. కాగా రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని టీడీపీ అధినేత చంద్రబాబు రైతులందరికీ శుభాకాంక్షలు చెబుతూ, ఒక ట్వీట్ కూడా చేశారు. కాగా “మాజీ ప్రధాని, స్వర్గీయ చౌదురీ చరణ్ సింగ్ రైతుల కోసం చేసిన ఉద్యమాలు, తెచ్చిన సంస్కరణలు చిరస్మరణీయం. అలాంటి రైతు బాంధవుని జయంతిని జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకుంటున్న ఈవేళ అన్నదాతలందరికీ శుభాకాంక్షలు” అంటూ చంద్రబాబు వాఖ్యానించారు.
అంతేకాకుండా “సమాజానికి అన్నం పెట్టే రైతు ఋణం తీర్చుకోడానికి, గత ఐదేళ్ళ తెదేపా హయాంలో అన్నదాతల ఆనందానికి బాటలువేసి, రైతు ప్రభుత్వంగా గుర్తింపు తెచ్చుకున్నాం. ప్రతిపక్షంలో ఉన్నా మాది రైతుపక్షమే. అన్నివేళలా మీకు తెదేపా అండగా ఉంటుందని ఈ రైతు దినోత్సవ వేళ మరోసారి గుర్తుచేస్తున్నాను” అంటూ చంద్రబాబు తన అధికారిక ట్విట్టర్ వేదిక ద్వారా వెల్లడించారు. ఇకపోతే చంద్రబాబు ఈ వాఖ్యలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని ఉద్దేశించి చేశారని కొందరు నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు… ఎందుకంటే రాష్ట్రంలో వైసీపీ పాలన అధికారంలోకి వచ్చినప్పటినుండి కూడా రైతులకు అన్యాయం చేశారని టీడీపీ నేతలు గత కొంత కాలంగా ఆరోపిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అంతేకాకుండా ఇటీవల రాష్ట్ర రాజధాని విషయంలో కూడా రైతులకు సీఎం జగన్ అన్యాయం చేశారని రైతులు కూడా దీక్షలు చేసున్నారు…