జగన్ నిర్ణయాన్ని తప్పుపడుతున్న చంద్రబాబు నాయుడు

జగన్ నిర్ణయాన్ని తప్పుపడుతున్న చంద్రబాబు నాయుడు

ఏపీకి మూడు రాజధానులు ఉండాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం తీసుకురాడంతో దీనిపై రాజధాని రైతులు, ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతున్నాయి. అయితే ఏపీకి మూడు రాజధానుల అంశంపై వైసీపీ నేతలే జగన్ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.

అయితే వైసీపీ నేతల నిర్వాకాలు, మంత్రుల మాటలు రాజధాని రైతుల మనస్సులను ఎంత గాయపరుస్తున్నాయో, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఎంత చిచ్చు పెడుతున్నాయో, ఈయన మాటలు వినైనా ప్రభుత్వం అర్థం చేసుకోవాలని చంద్రబాబు నాయుడు తన ట్విట్టర్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. అంతేకాదు ఇతను వైసీపీ నేత అని ఆయన మాటల్లోనే తెలుస్తోంది. అయినా ఆయన రాజధాని రైతుల బాధ గురించి మాట్లాడుతున్నారు. ఇతన్ని కూడా పెయిడ్ ఆర్టిస్టు అంటారా అంటూ ప్రశ్నించారు.