Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
శిల్పా మోహన్ రెడ్డి టీడీపీకి హ్యాండివ్వడంపై ఆపార్టీ అధినేత చంద్రబాబు స్పందన ఇలాగే ఉందట. శిల్పా ప్రకటన రాగానే కర్నూలు సీనియర్ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు.. ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరతామని బూస్ట్ ఇచ్చారట. ఎన్నోరకాల సర్వేలు చేశాకే ఈ విషయం చెబుతున్నామని, కార్యకర్తలకు అనుమానాలు ఉంటే నివృత్తి చేయాలని ఆయన సూచించారట.
తాను కూడా నంద్యాల వస్తానని మంత్రి భూమా అఖిలప్రియకు చెప్పిన చంద్రబాబు.. ఆలోగానే అభివృద్ధి కార్యక్రమాలన్నీ పూర్తిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఉపఎన్నికలకు వెళ్తున్నాం కాబట్టి నియోజకవర్గంలో ఇచ్చిన హామీలేవీ పెండింగ్ ఉండకూడదని ప్రత్యేకంగా చెప్పినట్లు సమాచారం. చంద్రబాబు కసరత్తు చూస్తుంటే శిల్పా బ్రదర్స్ కుమిలిపోయేలా చేయడానికి కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తోంది.
టీడీపీని వీడి చాలా పెద్ద తప్పు చేశామన్న భావన వారికి కలగాలన్నది బాబు వ్యూహంగా ఉంది. అసలు నంద్యాలలో వైసీపీకి క్యాడర్ లేదనేది టీడీపీ వర్గాల మాట. ఉన్నా అదేమంత చెప్పుకోదగ్గ సంఖ్యలో లేదని, అదీ శిల్పాకు టికెట్ ఇస్తే.. సగం మంది పనిచేయారని నమ్మకమైన సమాచారం ఉంది. అందుకే పోతేపోనీ గెలుపు మనదే అన్న ధీమాలో ఉన్నారు తమ్ముళ్లు.