జగన్ మోహన్ రెడ్డి ఫై చంద్రబాబు మరొకసారి సంచలన వ్యాఖ్యలు

జగన్ మోహన్ రెడ్డి ఫై చంద్రబాబు మరొకసారి సంచలన వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫై చంద్రబాబు మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రతిఒక్కరూ తుగ్లక్ తుగ్లక్ అంటుంటే ముఖ్యమంత్రి జగన్ తట్టుకోలేకపోతున్నారని సంచలన వ్యాఖ్యలు చేసారు. ఉక్రోషం పట్టలేక హిందూపూర్ లో బాలకృష్ణ ఫై, వైజాగ్ లో టీడీపీ ఆఫీస్ ల ఫై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు సంచలన ఆరోపణలు చేసారు. ప్రశాంతంగా ఉండే విశాఖ నగరంలో రౌడీలు కాగడాలతో తిరగడమా అని సంచలన వ్యాఖ్యలు చేసారు. ఎక్కడ పడితే అక్కడ టీడీపీ నేతల్ని, ఎమ్మెల్యేల్ని అడ్డుకోవడమా? ఏమిటివన్నీ వీటిని తీవ్రంగా ఖండిస్తున్నాం అని చంద్రబాబు అన్నారు.

సీఎం కాకముందు, అయిన తర్వాత కూడా జగన్ కి అవినీతి అలవాటుగా ఉందని అన్నారు. చేతకానితనం, తెలివితక్కువతనం, దేశం మొత్తానికి తెల్సింది అని సంచలన వ్యాఖ్యలు చేసారు. అయితే అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే, రాష్ట్రాన్ని అగ్ని గుండంలా మార్చేసిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. బాలయ్యని వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడం పట్ల, సీమ ద్రోహి అనడాన్ని చంద్రబాబు తప్పుబట్టారు.