Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కాపులకు రిజర్వేషన్ ఇస్తూ చంద్రబాబు సర్కార్ తీసుకున్న నిర్ణయం రాజకీయంగా పెను సంచలనాలకు దారి తీసేట్టు వుంది. ఇన్నాళ్లు బాబు అంటే మండిపడ్డ కొందరు నేతల ఆలోచనలో సమూల మార్పులు వస్తున్నాయట. ముద్రగడ పద్మనాభం , కన్నా లక్ష్మీనారాయణ సైతం యాంటీ బాబు అనే భావజాలాన్ని వదిలేస్తే మంచిదన్న ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. కొందరు సన్నిహితులు ఇచ్చిన సలహా మేరకు ఈ ఇద్దరు తమ రాజకీయ భవిష్యత్ తో పాటు కొడుకుల ఉన్నతిని దృష్టిలో ఉంచుకుని టీడీపీ లో చేరడం గురించి ఆలోచిస్తున్నారట. అయితే ఈ వ్యవహారం వీరు అనుకున్నంత మాత్రాన అయిపోయే పరిస్థితి లేదు.
కన్నా , ముద్రగడ ఇద్దరూ రాజకీయంగా చంద్రబాబుని తీవ్రంగా వ్యతిరేకించిన వాళ్ళే. రిజర్వేషన్ అంశానికి ముందు కూడా వాళ్ళు బాబుకు వ్యతిరేకంగా ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా విమర్శలు చేశారు. తమని భౌతికంగా లేకుండా చేయడానికి కూడా బాబు కుట్ర చేసినట్టు ఆరోపణలు చేసిన ఈ ఇద్దరూ టీడీపీ లో చేరడానికి బాబు ఒప్పుకున్నా స్థానికంగా వుండే సమస్యలతో పాటు పార్టీ శ్రేణులు ఎలా స్పందిస్తాయో అన్న భయం కూడా లేకపోలేదు.
ఈస్ట్ గోదావరిలో ప్రత్తిపాడు టికెట్ కొడుక్కి ఇప్పించుకోడానికి ముద్రగడ, తనకు గుంటూరు జిల్లాలో ఎక్కడో చోట టికెట్ ఇస్తే చాలని కన్నా అనుకుంటున్నారు. అయితే కన్నా రాకను ఒక్క రాయపాటి మాత్రమే కాదు ఎంతో మంది వ్యతిరేకిస్తున్నారు. అయితే వీళ్ళ వ్యవహారంలో ఒకే ఒక్క ప్లస్ పాయింట్ కూడా కనిపిస్తోంది. కాపులకు రిజర్వేషన్ ఇస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నాక ఆ వర్గంలో మార్పు వచ్చిందని చెప్పుకోడానికి ఇలాంటి నేతల చేరిక పనికొస్తుంది. ఆ పాయింట్ తోటే ముద్రగడ, కన్నా కూడా పావులు కదిపే ధైర్యం చేస్తున్నారట. మొత్తానికి ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. రాజకీయాల్లో ఏమి జరిగినా ఆశ్చర్యపోడానికి ఏమీ లేదు.