రీల్ లైఫ్‌లో విలన్ పాత్రలు పోశించినా రియల్ లైఫ్‌లో నిజమైన హీరో అనిపించుకుంటున్నాడు. కరోనా కష్టకాలంలో ఇబ్బందులు పడుతున్న ఎందరికో తనవంతు సాయం అందచేస్తూ వస్తున్న సోనూసూద్ జనాలలో నిజమైన దేవుడుగా నిలిచిపోయాడు. అయితే నేడు సోనూసూద్ పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియాలో ప్రముఖులు, అభిమానులు, ఆయన సాయం పొందిన వారి నుంచి బర్త్‌డే విషెష్ వెల్లువెత్తుతున్నాయి.
అయిటే టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా సోనూసూద్‌కి ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. కరోనా క్లిష్ట సమయంలో ఇబ్బందుల్లో ఉన్న ఎందరికో మీరు సాయపడుతున్నారని, నిస్వార్ధ సేవ చేస్తున్న నిజమైన హీరో మీరు సోనూజీ అంటూ భవిష్యత్తులో మీరు చేసే ప్రతి పనిలో దేవుని బలం అండగా ఉండాలని ట్వీట్ చేశారు.