గవర్నర్ మీద బాబు ఇన్ డైరెక్ట్ ఎటాక్ ?

Chandrababu accuses BJP of misusing Governor's office

కాస్త రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఎవరయినా చంద్రబాబు వ్యవహార శైలిని సునిశితంగా పరిశీలిస్తారు ఎందుకంటే ఆయన రాజకీయంగా ఆరోపణలు చేసేప్పుడు అన్నే ఆలోచించాకే అవతఃలి వారు ఇక ఎటాక్ చేయలేన్ విధంగా ఆరోపణలు చేస్తారు. అదే ఇక రాజ్యాంగ వ్యవస్థలపై వ్యాఖ్యలు చేసేటప్పుడు అయితే చెప్పనవసరంలేదు, ఎన్ని జాగ్రత్తలు తీసుకుని మాట్లాడతారో ? అయితే ఇటీవలి కాలంలో ఆయన గవర్నర్ వ్యవస్థపై తన ఆగ్రహాన్ని ఏ మాత్రం దాచుకోవడం లేదు. కేంద్రంతో కలిసి రాజ్‌భవన్ కేంద్రంగా… తెలుగుదేశం పార్టీపై, ప్రభుత్వంపై.. నరసింహన్ కుట్ర పన్నుతున్నారని ప్రచారం జోరుగా సాగుతున్న సమయంలో.. కొద్ది రోజుల కిందట అసలు గవర్నర్ల వ్యవస్థ అవసరమా అని పేర్కొని సంచలనం రేపారు.

తాజాగా ఇప్పుడు గవర్నర్ కార్యాలయాలను కేంద్రం తన రాజకీయ అవసరాలకు వాడుకుంటోందని ట్వీట్ చేశారు చంద్రబాబు. దీంతో ఒక్కసారిగా అటు కేంద్ర -రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ కలకలం రేగింది. ఎందుకంటే గవర్నర్ నరసింహన్ ప్రస్తుతం రాజకీయ నివేదికలతో హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తోనూ. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీల కోసం ఢిల్లీలో తిష్ట వేయడమే. కొద్ది రోజుల కిందటే రహస్యంగా గవర్నర్ మోదీతో గంట సేపు సమావేశమైన ఏపీ రాజకీయాలపైనే ఎక్కువగా చర్చించారన్న ప్రచారం జరిగింది. అలా హైదరాబాద్ వచ్చీ రాగానే ఏపీ బీజేపీ నేతలను కలిసారు. మోదీని అందరూ తిడుతున్నారన్న కారణం చూపి ఫిర్యాదు చేయడానికి వెళ్లామని బీజేపీ నేతలు చెప్పుకున్నా వాస్తవం మాత్రం గవర్నర్ నరసింహన్ ఢిల్లీ నుంచి ఏదో సందేశం తెచ్చారన్న అనుమానాలని అప్పట్లోనే తెలుగుదేశం వ్యక్తం చేసింది.

ఇక కొద్దిరోజుల నుండి ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ నాలుగు రోజుల నుంచి ఢిల్లీలో మకాం వేశారు. ప్రధాని సహా బీజేపీ అగ్రనేతలతో చర్చల్లో మునిగి తేలుతున్నారు. అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణతో కలిసి రామ్‌మాధవ్‌ను కలిశారు. ఈ విషయాన్నీ వారు బయట పెట్టకపోయినా తెలుగుదేశం బట్టబయలు చేసింది. ఇదే సమయంలో ఏపీ రాజకీయాలపై నివేదికలతో గవర్నర్ ఢిల్లీకి చేరుకున్నారని కూడా ప్రచారం సాగింది. రాజకీయాలకు సంబంధం లేదని వారు పేర్కొంటున్నా ఇంతకు ముందు ఎటువంటి ముందస్తు ప్లాన్ లేకుండా ఇంత హుటాహుటిన ఢిల్లీకి పోవాల్సినంత ఘనకార్యాలేమీ తెలుగు రాష్ట్రాల్లో జరగలేదు.

కేసీఆర్ కూడా అదే సమయంలో ఢిల్లీలో మంతనాలు సాగించడం ఇప్పుడు అనేక అనుమానాలని రేకెత్తిస్తోంది. గవర్నర్ సహాయసహాకారలతో ఢిల్లీలో కుట్ర రాజకీయాలు జరుగుతున్నాని భావించే చంద్రబాబు ట్వీట్ చేశారని అందరూ భావించారు. అయితే అపర చాణక్యుడిగా పేరున్న బాబు వెంటనే లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో ధర్నా చేస్తున్న ఢిల్లీ ముంఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు సంఘీభావం తెలిపారు. అంటే కర్ర విరక్కుండా పాముని చంపడానికి బాబు ప్రయత్నించారు. ఏది ఏమయినా గవర్నర్ అంటేనే రబ్బర్ స్టాంప్ అనే భావన దాదాపు అందరిలోనూ ఉంది.