ముద్రగడ లాస్ట్ మినిట్ డిమాండ్ కూడా ఓకే.

Chandrababu approves Mudragada Demand

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని నడిపించిన ముద్రగడ పద్మనాభం కూడా వూహించనిదే జరిగింది. కాపు రిజర్వేషన్ కి సంబంధించి ముద్రగడ చేసిన ప్రతి డిమాండ్ తీరినట్టే కనిపిస్తోంది. ముద్రగడ ని పాదయాత్ర కోసం బయటకు రాకుండా కట్టడి చేసిన చంద్రబాబు సర్కార్ ఆయన డిమాండ్స్ విషయంలో మాత్రం పూర్తి సానుకూల ధోరణిలో ముందుకు వెళ్ళింది. కాపు రిజర్వేషన్ ప్రకటనకు చంద్రబాబు సర్కార్ సిద్ధంగా ఉందని తెలుసుకున్న ముద్రగడ ఓ వారం కిందట కొత్త డిమాండ్ తెర మీదకు తెచ్చారు. కాపులను బీసీల్లో చేర్చడమే కాకుండా వారిని ప్రత్యేక కేటగిరిగా గుర్తించి ఆ విభాగానికి స్పెషల్ గా రిజర్వేషన్ వర్తింపజేయాలని ముద్రగడ అడిగారు. ఇదేదో చంద్రబాబు సర్కార్ ని ఇబ్బంది పెట్టడానికి అని చూసే వారికి అనిపించింది. రిజర్వేషన్ విషయంలో చంద్రబాబుని ఇంకా కార్నర్ చేయడానికే ముద్రగడ చివర నిమిషంలో ఇలాంటి డిమాండ్స్ పైకి తెస్తున్నారని టీడీపీ కి చెందిన కాపు నేతలు కూడా కొందరు ఆంతరంగిక సమావేశాల్లో అభిప్రాయపడ్డారు. అయితే వారి అంచనాలకు భిన్నంగా బాబు సర్కార్ ముద్రగడ చేసిన లాస్ట్ మినిట్ డిమాండ్ ని కూడా ఓకే చేసింది.

mudragada padmanabham

బీసీ ఎఫ్ కేటగిరిగా కాపులను గుర్తిస్తూ చంద్రబాబు సర్కార్ బిల్లు పెడుతుందని ముద్రగడ కూడా అనుకోలేదు. అయినా చంద్రబాబు ఆ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ రిజర్వేషన్ అమలు కోసం కేంద్రం మీద కూడా భారాన్ని మోపారు. కాపు రిజర్వేషన్ బిల్లు ని రాజ్యాంగంలోని 9 వ షెడ్యూల్ కిందకు చేర్చడం అనే అతి కీలకమైన బాధ్యతను కేంద్రం మీద ఉంచారు. ఇప్పుడు కాపు రిజర్వేషన్ బంతి కేంద్రం కోర్టులోకి వెళ్ళింది. ఇప్పటిదాకా చంద్రబాబుని టార్గెట్ చేసిన వాళ్ళు ఇకపై కేంద్రాన్ని అంటే మోడీని టార్గెట్ చేయాల్సి ఉంటుంది. రాజకీయంగా కూడా బీజేపీ కి ఇది పెద్ద సవాల్. కాపు రిజర్వేషన్ అంశాన్ని పట్టుకుని ఇక్కడ పాతుకుపోవాలని భావించిన బీజేపీ కి ఇది ఊహించని పరిణామం. ఇక బాబు తాజా నిర్ణయంతో ఇప్పటిదాకా ఆయన మీద ఒంటి కాలుతో లేచిన ముద్రగడ వెను వెంటనే స్పందించలేకపోయారంటేనే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.