ఢిల్లీ లో నిరసనలు ఆపేసిన టీడీపీ, కొత్త ప్లాన్ లో బాబు

Chandrababu calls TDP MP's to Stop Protest in Delhi

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఢిల్లీ లో టీడీపీ ఎంపీలు తమ నిరశన ప్రదర్సనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే మూడు రోజులుగా నిరసనలు చేస్తున్నా ప్రధాని మోదీ స్పందించడం లేదని ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రజాక్షేత్రంలోనే నిలదీస్తామని ఎంపీలు తెలిపారు. ఎంపీలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ సందర్భంగా ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీలో ఉద్యమించిన టీడీపీ ఎంపీలను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. ఢిల్లీ నుంచి వచ్చేయాలని ఎంపీలను ఆయన ఆదేశించారు. చంద్రబాబు ఆదేశాలతో రేపు ఉదయం కల్లా టీడీపీ ఎంపీలు ఏపీకి చేరుకోనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం కార్యాచరణ రూపొందించే పనిలో పడ్డారు సీఎం చంద్రబాబు. రేపు మధ్యాహ్నం టీడీపీ అధికార ప్రతినిధులతో బాబు సమావేశం కానున్నారు. నియోజకవర్గాల్లో పర్యటించాలన్న సీఎం చంద్రబాబు సూచనతో ఎంపీలు రాష్ట్రానికి బయలుదేరారని తెలుస్తోంది. ప్రధాని మోదీ నివాసాన్ని ముట్టడించడం, రాజ్ ఘాట్ వద్ద దీక్ష చేపట్టడంలాంటి కార్యక్రమాలతో మనం చేస్తున్న పోరాటం అందరి దృష్టికి వెళ్లిందని, రేపటి సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుందామని చెప్పారు. అయితే, ఎంపీలతో ‘ఆత్మగౌరవం’ పేరిట బస్సు యాత్ర నిర్వహించాలని చర్చకు వచ్చినట్లు తెలిసింది.

రాష్ట్రవ్యాప్తంగా వివిధ చోట్ల చంద్రబాబు పాల్గొనేలా బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని ఏర్పాట్లు చేస్తున్నారు. 2,3 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఎంపీల బస్సు యాత్ర కూడా చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉద్యమంలో భాగంగా మేధావులు, వివిధ సంఘాలతో సమావేశం కావాలని… జిల్లాల వారీగా అఖిలపక్ష సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. నియోజకవర్గాల వారీగా సైకిల్ యాత్రలు నిర్వహించాలని పార్టీ నేతలని చంద్రబాబు ఆదేశించారు.