సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్థానిక జనంపై అక్కసును వెళ్లగక్కారు. ఇటీవల జరిగిన ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు.. వెయ్యి, రెండు వేలకు అమ్ముడు పోతారా అంటూ జనంపై చిందులు తొక్కారు. టీడీపీ 22 సంవత్సరాలు అధికారంలో ఉందని, తాను తలుచుకుంటే ఎంతైనా డబ్బు ఇవ్వగలనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తనకు విలువలు ముఖ్యమని, మీరు డబ్బులకు అమ్ముడుపోయి తప్పు చేశారని జనాలను ఉద్ధేశించి వ్యాఖ్యలు చేశారు. అయితే కుప్పం టీడీపీ నేతలు, కార్యకర్తలను సైతం చంద్రబాబు వదల్లేదు. స్థానిక ఎన్నికల్లో కొందరు టీడీపీకి ఎలా మోసం చేసారో తనకు తెలుసంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ల చరిత్ర అంతా నా దగ్గర ఉందంటూ మండిపడ్డారు. పార్టీలో కొందరు కోవర్టులు ఉన్నారని , ఎవ్వరినీ వదలను అంటూ హెచ్చరించారు. డబ్బులకు అమ్ముడు పోయి తప్పు చేశారంటూ ధ్వజమెత్తారు.