తిరుమలలో చంద్రబాబు… బులెట్ పాయింట్స్

Chandrababu Grandson Devansh Birthday Celebration

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]  

  • విభజన చట్టంలోని హామీలను కేంద్రం అమలు చేయాలి – ఎపి సిఎం చంద్రబాబు నాయుడు

  • రాష్ట్ర విభజన, సమయంలో ఎంతో బాధపడ్డా

  • ఎపికి ప్రత్యేక హోదా సాధించే ధైర్యం ఇవ్వమని స్వామివారిని ప్రార్థించా

  • కేంద్రంపైన పోరాటం కొనసాగుతూనే ఉంది

  • జపాన్ తరహాలో ఆందోళన, అభివృద్ధి రెండూ కొనసాగుతోంది

  • మా ఇంటి కులదైవం – నేను ఆరాధించే దేవుడు వేంకటేశ్వరస్వామి

  • నా మనవడు దేవాన్ష్ కు మూడేళ్ళు పూర్తి కావడంతో శ్రీవారిని దర్సించుకున్నాం

  • తిరుమలలో రాజకీయాలను మాట్లాడనంటూనే ఐదు నిమిషాల పాటు ఎపిలో నెలకొన్న పరిస్థితులు, టిడిపి కేంద్రంపై చేస్తున్న పోరాటాన్ని మీడియాకు వివరించిన సిఎం

  •   టీటీడీ అన్న దాన పథకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు మనవడి తరుపున రూ.26 లక్షలు విరాళం.

  • వెంగమాంబ సత్రంలో భక్తులకు అన్న ప్రసాదం వడ్డన,స్వీకరణ.

  • ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మనుమడు నారా దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు బుధవారం ఉదయం

    తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం శ్రీ వెంగమాంబ అన్న ప్రసాదం హాల్ చేరుకుని ముఖ్యమంత్రి వారి కుటుంబ సభ్యులు అన్న ప్రసాధములు కుటుంబసభ్యులతో స్వీకరించారు.

  • ఈ సందర్భంగా అన్న ప్రసాదం సేవకులు ముఖ్యమంత్రి కి వారి కుటుంబ సభ్యులకు టిటిడి సేవా స్కార్ఫ్ ను గౌరవంగా వారి భుజాల చుట్టూ వేశారు

  • సీఎం, వారి కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, కుటుంబ సభ్యులు శ్రీవారి అన్న ప్రసాదం హాల్లో భక్తులకు అన్న ప్రసాదములను వడ్డించారు.

  • ఈసందర్భంగా తన, మనుమడు పుట్టినరోజు సందర్భంగా నారా దేవాన్ష్ తరఫున 26 లక్షల రూపాయల విరాళాన్ని డిడి రూపంలో శ్రీవారి అన్న ప్రసాదం సేవకోసం టిటిడి ఈఓ, తిరుమల జేఈఓ లకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందచేశారు. ఈ కార్యక్రమంలో మనుమడు దేవాన్ష్, మంత్రి నారా లోకేష్ కుటుంబ సభ్యులు. పాల్గొన్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యులు, జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న, ప్రజా ప్రతినిధులు, టిటిడి అధికారులు పాల్గొన్నారు.