Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఈ మధ్య రాజకీయాల్లో కొందరు నేతలు అతి విశ్వాసంతో తమ ప్లాన్ కి కౌంటర్ ఉండదు అనుకుంటూ బొక్కబోర్లా పడుతున్నారు. ఈ కోవలో అటు ప్రధాని, ఇటు వైసీపీ అధినేత జగన్ వేసిన ఎత్తులకు దిమ్మతిరిగే కౌంటర్ ప్లాన్ రెడీ చేసాడు చంద్రబాబు. ఆ ప్లాన్ కి బీజేపీ, వైసీపీ గిజగిజలాడుతున్నాయి. ఇంతకీ ఈ మ్యాటర్ అంతా పోలవరంతో ముడిపడి వుంది.
విభజన చట్టంలో భాగంగా పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అయ్యింది. ఈ ప్రాజెక్ట్ వ్యయాన్ని కేంద్రమే భరించినా నిర్మాణ బాధ్యతల్ని మాత్రం రాష్ట్రానికి అప్పగించింది. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే రాష్ట్రం దశ, దిశ మారతాయని భావించిన చంద్రబాబు దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ప్రతి సోమవారం పోలవరం మీద సమీక్ష చేస్తూ నిర్మాణ పనులను పరుగులెత్తించారు. కానీ కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్ ట్రాయ్ ఆర్ధిక సామర్ధ్యం సరిపోదనే భావంతో కొత్త కాంట్రాక్టర్ కి పనులు అప్పగించాలి అనుకున్న చంద్రబాబుకి కేంద్రం అడ్డంకులు పెట్టింది. సరే కొత్త టెండర్లు పిలిచి కనీసం కాపర్ డ్యామ్ అయినా స్పీడ్ గా పూర్తి చేయాలని భావించారు చంద్రబాబు. అయితే చంద్రబాబు స్పీడ్ కి బ్రేకులేసే ఉద్దేశంతో అసలు కాపర్ డ్యామ్ అవసరం లేదని, డిజైన్ మారుద్దాం అని కేంద్రం కొర్రీ పెట్టింది. దీంతో వైసీపీ చంకలు గుద్దుకుంది. బీజేపీ లోని బాబు వ్యతిరేకులు సంబరపడ్డారు. అక్కడే వాళ్ళు బాబుని తక్కువ అంచనా వేశారు.
పోలవరం ను సాకుగా పెట్టుకుని తనని ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో బీజేపీ ఆడుతున్న రాజకీయ క్రీడని బాబు బాగా అర్ధం చేసుకున్నారు. అవసరం అయితే రాష్ట్రం ఖర్చులతో అయినా ప్రాజెక్ట్ పూర్తి చేస్తానని చెప్పడమే కాకుండా అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. బాబు చేసిన ఈ ప్రకటనతో ఇటు కేంద్రం అటు వైసీపీ గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. ఒకవేళ బాబు చేసే పనికి అడ్డం పడితే పోలవరానికి డబ్బులు ఇవ్వకపోగా పని చేస్తుంటే అడ్డం పడుతుందనే అపవాదు బీజేపీ కి తప్పదు. ఈ విషయం గమనించే అప్పటిదాకా బాబుని ఏకే బీజేపీ నేతలు సైతం ఢిల్లీ వెళ్లి గడ్కరీ తో పోలవరం పనులు ఆపొద్దని కాళ్లావేళ్లా పడ్డారు. వైసీపీ మాత్రం బాబు రాష్ట్రం డబ్బులతో పోలవరం పూర్తి చేస్తాననడం మీద ఎలా స్పందించాలో అర్ధం గాక తన అనుకూల మీడియాలో ఏపీ మీద ఆర్ధిక భారం అని కధనాలు రాయిస్తోంది. మొత్తానికి పోలవరం మీద బాబు వేసిన కౌంటర్ ని ఎలా ఎదుర్కోవాలో అర్ధంగాక బీజేపీ, వైసీపీ గిజగిజలాడుతున్నాయి.