చంద్రబాబు నా ఫ్రెండే…అదంతా మీడియా సృష్టి

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ముఖ్యమంత్రి కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం పలు రాష్ట్రాల కీలక నేతలతో భేటీలు జరుపుతున్న సంగతి తెలిసింద. ముందుగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిసి మాట్లాడి వచ్చారు. తర్వాత కర్నాటక లోని దేవెగౌడ ని కలిసిన ఆయన నిన్ననే చెన్నయి వెళ్లి కరుణానిధిని కలిసి వచ్చారు. త్వరలో ఓడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో భేటీ కాబోతున్నట్లు సమాచారం. ముందు నుండి ఆయన ఆయన తీరు గమనించిన వారికి ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఈ ఫ్రంట్ లో కలుపుకోరు అని భావించారు. అయితే వారి అంచనాలని పటాపంచలు చేస్తూ తానూ చంద్రబాబుతో కలిసి పని చేసేందుకు సిద్దం అని ప్రకటించారు. వివరాల లోకి వెళితే సీఎం కేసీఆర్ నిన్న చెన్నై పర్యటనకి వెళ్ళిన సంగతి తెలిసిందే.
ఆ భేటీలు అవీ ముగించాక  డీఎంకే ప్రెసిడెంట్ కరుణానిధి, వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్తో కలిసి మీడియాతో మాట్లాడిన కేసీఆర్ భారతదేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలని అందుకు కేంద్రం రాష్ర్టాలకు మరిన్ని అధికారాలు ఇవ్వాలన్నారు. ఫ్రంట్ ఏర్పాటుకు ఇది ప్రారంభం కాదు.. ముగింపు కాదు.. మరిన్ని చర్చలు జరుపుతామని కేసీఆర్ ప్రకటించారు. ప్రెస్ మీట్ ఇలా జరిగిపోతున్న తరుణంలో ఓ జర్నలిస్ట్  దేశం మొత్తం తిరుగుతున్నారు, అందరిని కలుపుకుపోతా అంటున్నారు మరి మీ పొరుగునే ఉన్న ఏపి ముఖ్యమంత్రి, మీ పాత మిత్రుడు చంద్రబాబుని కలుపుకు పోరా అని ప్రశ్నిస్తే ఒక్క నిముషం తెల్ల మొహం వేసిన ఆయన వెంటనే తేరుకుని మేము ఎవరితో కలిసి పని చేస్తాం.. చేస్తున్నాం అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. మేమెప్పుడు ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తామని చెప్పలేదు. మీడియానే తృతీయ ఫ్రంట్‌ అంటూ ప్రచారం చేస్తోందన్న సీఎం చంద్రబాబు నాకు మంచి మిత్రుడు. కూటమి ఏర్పాటుపై చంద్రబాబుతోనూ చర్చలు జరుపుతాం` అని కేసీఆర్ ప్రకటించారు.