ఒకే ఒక్కడు సినిమా చూపించబోతున్న చంద్రబాబు.

chandrababu naidu started first RTGS Video Conference in Asia

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

“ ఒకే ఒక్కడు “ సినిమా గుర్తుందా ? ఎప్పుడో 18 సంవత్సరాల కిందట వచ్చిన ఈ సినిమా ఓ సంచలనం. ఓ నిజాయితీపరుడైన వీడియో జర్నలిస్ట్ ఒక రోజు సీఎం అయితే ఎలా ఉంటుందో చూపిన సినిమా ఇది. ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన వెంటనే ఆ జర్నలిస్ట్ జనంలో తిరుగుతూ ఎక్కడ ఏ అధికారి తప్పు చేసినా నేరుగా అతడికే ఫోన్ చేసి సస్పెండ్ చేసిన సీన్ చూసిన జనాలు నిజంగా ఇలాంటి పాలన ఎప్పుడైనా వస్తుందా అనుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు దాదాపు అలాంటి పాలన చూపించడానికి రెడీ అయ్యారు. అయితే ఆయన అధికారులతో నేరుగా మాట్లాడేది ఆన్ ది స్పాట్ సస్పెండ్ చేయడానికి మాత్రం కాదు. ఆన్ ది స్పాట్ పని చేయించడానికి.

chandra-babu-naidu

ఎక్కడో ఫీల్డ్ లో వుండే కింది స్థాయి ప్రభుత్వ ఉద్యోగితో సీఎం నేరుగా మాట్లాడి పని చేయించడం అనేది పెద్ద కల. ఆ కలను నిజం చేసే అత్యాధునిక వ్యవస్థ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అందుబాటులోకి వచ్చింది. RTGS ఏర్పాటు చేసిన ఈ కమాండ్ కంట్రోల్ వ్యవస్థను చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈ వ్యవస్థలో భాగంగా ఆసియాలోనే అతిపెద్ద వీడియో కాన్ఫరెన్స్ రూమ్ ఏర్పాటు చేశారు. టెక్నికల్ గా సరికొత్త హంగులతో వచ్చిన ఈ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ అధికారులు సీఎం వీడియో కాన్ఫరెన్స్ కోసం ప్రత్యేకంగా ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వచ్చే అవసరం ఉండదు. తాము వున్న ప్రాంతం నుంచే వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనవచ్చు. ఒక్క సెల్ ఫోన్ ఉంటే …దానికి సిగ్నల్ ఉంటే చాలు …ఎక్కడ నుంచి అయినా సీఎం వీడియో కాన్ఫరెన్స్ లో పార్టిసిపేట్ చేయొచ్చు.

chandra-babu

ఈ కమాండ్ కంట్రోల్ వ్యవస్థలో ఇంకో గొప్ప విషయం ఏమిటంటే …సీఎం ఈ కేంద్రం నుంచి సర్వే లెన్స్ కెమెరాల ద్వారా రాష్ట్రం మొత్తాన్ని నేరుగా చూడొచ్చు. ఇందుకోసం ఇప్పటికే 5 వేల కెమెరాలు ఏర్పాటు చేశారు. త్వరలో మరో 15 వేల కెమెరాలు ఏర్పాటు చేయబోతున్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురు అయినప్పుడు సీఎం సహా సంబంధిత అధికార వర్గం ఏ ప్రాంతంలో పని చేస్తున్న అధికారులతో అయినా నేరుగా చూస్తూ ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇందు కోసం అవసరం అయితే కొన్ని డ్రోన్ కెమెరాలు కూడా వాడే ఛాన్స్ వుంది. ఎక్కడైనా ఏ ప్రమాదం లేదా ఇతరత్రా జనజీవితాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉత్పన్నం అయ్యినప్పుడు ఈ కెమెరాల ద్వారా సీఎం ఆ ప్రదేశంలో ఏమి జరుగుతుందో చూస్తూ అధికారులకు దిశానిర్దేశం చేయొచ్చు. రియల్ గవర్నెన్స్ అంటూ సీఎం చెప్తున్న దాంట్లో ఈ వ్యవస్థ ఏర్పాటు పెద్ద ముందడుగు.

ap-cm