ఎనీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ పాలిట్రిక్స్…రాహుల్-బాబు ప్రచారం…!

Rahul Gandhi To Meet AP Congress Leaders In Delhi

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరనేది నానుడి. ఇది ఈ రోజు మరోసారి నిరూపితమవుతుంది. దశాబ్దాల పాటు.. వ్యతిరేక పార్టీలుగా మెలిగిన.. కాంగ్రెస్, టీడీపీ ల అధ్యక్షుడు.. ఒకే వేదికపై ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. నిన్నమొన్నటి వరకూ బద్ధ శత్రువులుగా ఉండి, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న కాంగ్రెస్, తెలుగుదేశం నేతలు ఇప్పుడు స్నేహితులుగా మారి ఒకటైన వేళ, ఇరు పార్టీల జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ, చంద్రబాబునాయుడులు కలసి ఒకే బహిరంగ వేదికను నేడు పంచుకోనున్నారు. రాహుల్ గాంధీ ఉదయం కోడంగల్‌లో ఎన్నికల బహిరంగసభలో ప్రసంగించి మధ్యాహ్నం 2 గంటలకు ఖమ్మం గొల్లగూడం చేరుకుంటారు. ఖమ్మంలోని ఎస్పీ స్టేడియంలో ప్రజా కూటమి బహిరంగసభలో పాల్గొంటారు. ఈ మీటింగ‌్లోనే రాహుల్‌తో కలిసి ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ఇదే వేదికపై ఈ ఇద్దరు నేతలు ప్రసంగిస్తారు.

Chandrababu-Naidu-To-Campai

ఖమ్మంలో ఈ బహిరంగ సభ జరగనుండగా, రాహుల్ గాంధీ, చంద్రబాబునాయుడుతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎల్ రమణ, కోదండరామ్, గద్దర్, నామా నాగేశ్వరరావు, చాడ వెంకటరెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, రేణుకాచౌదరి, కుంతియాలతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజా కూటమి తరఫున బరిలోకి దిగిన 10 మంది అభ్యర్థులు కూడా పాల్గొంటారు. నేటి మధ్యాహ్నం 2 గంటల తరువాత రాహుల్, చంద్రబాబులు వేర్వేరు హెలికాప్టర్లలో సభా వేదిక వద్దకు చేరుకోనున్నారు. ఈ సభకు ఏర్పాట్లు పూర్తికాగా, పెద్దఎత్తున జన సమీకరణ చేసేందుకు కాంగ్రెస్, టీడీపీ నేతలు రంగంలోకి దిగారు. తర్వాత హైదరాబాద్‌లో సాయంత్రం 5.30 గంటలకు సనత్‌నగర్ సత్యం థియేటర్ బహిరంగసభలో పాల్గొంటారు. అక్కడి నుంచి నాంపల్లి నియోజకవర్గం అసిఫ్ నగర్‌లో చంద్రబాబు, రాహుల్ రోడ్ షో నిర్వహిస్తారు. తెలంగాణలో రెండో రోజు కూడా రాహుల్ పర్యటన కొనసాగనుంది. గురువారం ఉదయం 10.30 గంటలకు ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలతో సమావేశమవుతారు. మధ్యాహ్నం భూపాలపల్లి బహిరంగ సభలో… సాయంత్రం 5 గంటలకు పరిగి బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం చెవెళ్లలో ప్రచారం చేసి ఢిల్లీ వెళ్తారు. గురువారం కూడా చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది. కూకట్‌పల్లి, శేరిలింగంపల్లిలలో చంద్రబాబు రోడ్ షోలు నిర్వహిస్తారు. పోలింగ్ తేదీ సమీపించడంతో కీలక నేతలు రంగంలోకి దిగడంతో సీన్ మారుతుందని ప్రజాకూటమి నేతలు బావిస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు, రాహుల్ గాంధీ సభలు ప్రజాకూటమికి ఉత్సాహం ఇవ్వనున్నాయి.

Chandrababu-Naidu-rahul-gan